SBI Card and Bank of Baroda Festive Offers 2023 in Telugu :పండుగల సీజన్ కావడంతో ప్రైవేట్ బ్యాంకులతోపాటు ప్రభుత్వ బ్యాంకులు కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులకు షాపింగ్ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా.. ఇలాంటి ఆఫర్లను SBI కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించాయి. ముఖ్యంగా వీటిలో డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
SBI క్రెడిట్ కార్డ్‌పై డిస్కౌంట్ ఆఫర్స్:
Discount Offers on SBI Credit Card : పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని SBI కార్డ్ ఈ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ ప్రకారం.. SBI క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే రిలయన్స్ డిజిటల్ కొనుగోళ్లపై.. రూ.10 వేల దాకా తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఇందులో మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. EMI ద్వారా కొనుగోలు చేసినప్పటికీ.. మీరు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే.. కొన్ని షరతులు ఉన్నాయి. రూ.10 వేలు మొదలు ఆ పైన కొనుగోళ్లు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంది.
How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్లైన్ ఫెస్టివల్ ఆఫర్లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..!
ఎస్బీఐ డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్!
SBI Card Discounts And Cashbacks : దేశంలోని రూ.2,700 సిటీల్లో ఎస్బీఐ కార్డ్ ఫెస్టివ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, రిలయన్స్ రిటైల్ గ్రూప్, వెస్ట్‌సైడ్, పాంటలూన్స్, మ్యాక్స్, తనిష్క్, టీబీజెడ్ లాంటి పలు ఈ-కామర్స్ వెబ్‌సైట్స్, రిటైల్ స్టోర్స్‌లో ఎస్బీఐ కార్డ్ వినియోగించి కొనుగోలు చేస్తే 27.5% వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. మరికొన్ని ప్రొడక్టులపై ఏకంగా రూ.10,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డ్‌పై ఆఫర్:
Bank of Baroda Launched Offer on Debit Card: బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పండగ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ట్రావెల్, ఆన్లైన్ షాపింగ్, గ్రోసరీ, గృహోపకరణాల కొనుగోళ్లుపై భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ ఇస్తోంది. మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డ్‌తో మీషో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే.. 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అయితే.. ఈ ఆఫర్‌ను పొందేందుకు షరతు ఏమిటంటే.. మీ కనీస ఆర్డర్ రూ.600పైన ఉండాలి. ఈ ఆఫర్ నవంబర్ 6 వరకు అందుబాటులో ఉంది.
SBI Card Festive Offers 2023 : ఎస్బీఐ కార్డ్ బంపర్ ఆఫర్స్.. 27.5% వరకు క్యాష్‌బ్యాక్.. రూ.10,000 వరకు డిస్కౌంట్!
ICICI Bank Festive Offers : ఐసీఐసీఐ బ్యాంక్ పండుగ ఆఫర్స్.. రూ.26 వేల వరకు డిస్కౌంట్స్!.. క్యాష్‌బ్యాక్స్ కూడా..