Mukesh Ambani Employees Salaries in Telugu :సెలబ్రిటీ.. ఈ పదానికున్న ఆకర్షణే వేరు. సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌తో పాటు వారి దగ్గర పనిచేసేవారు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంట్లో పనిచేసే వారి జీతభత్యాల గురించి ఓ వార్త ఆసక్తికరంగా మారింది. అంబానీ ఇంట్లో పనిచేసే వర్కర్ల జీతాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.! టాప్ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల(Software Employees)కన్నా, సీఏ, ఎంబీఏ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల కన్నా అంబానీ ఇంట్లో పనిచేసే వారికి జీతం ఎక్కువని టాక్. ఇంతకీ ప్రపంచకుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు? వారి జీతభత్యాలు ఎంతో ఇప్పుడు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Mukesh Ambani Antilia Building Specialities : రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ కుటుంబం ముంబయిలోని అల్టామౌంట్ రోడ్‌లో నిర్మించిన 'ఆంటిలియా(Antilia)'లో నివాసముంటోంది. ఈ భవనం 4532 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ధర దాదాపు రూ.15 వేల కోట్లుగా అంచనా. లండన్‌లో ఉన్న బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత అత్యంత ఖరీదైన భవనం కూడా ఇదే.
ఈ ఆంటిలియా భవనం మొత్తం 27 అంతస్తుల్లో ఉంటుంది. కానీ భవనం అసలు ఎత్తు 40 అంతస్తులుగా కనిపిస్తుంది. దీనిని తీవ్ర భూకంపం వచ్చినా తట్టుకునేలా రూపొందించారు. ఈ 27 అంతస్తుల ఆంటిలియా భవనంలో మూడు హెలిపాడ్లు, 168 కార్ల పార్కింగ్ కోసం ఆరు అంతస్తులు, 50 మంది కూర్చుని చూసే సినిమా థియేటర్, స్పా, బాల్ రూమ్, 3 స్విమ్మింగ్ పూల్స్, యోగా, డ్యాన్స్ స్టూడియోలు, 9 ఎలివేటర్లు ఇతర అధునాతన సదుపాయాలున్నాయి. ఇంతటి విలాసవంతమైన భవనంలో ఎంత మంది పని చేస్తారో ఇప్పుడు చూద్దాం.