How to Login Sahara Refund Portal : సహారా గ్రూప్ అవకతవకల నేపథ్యంలో.. ఆ గ్రూప్‌నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో డబ్బులు దాచుకున్న డిపాజిటర్ల సొమ్మును తిరిగి చెల్లించేందుకు కేంద్రం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందుకోసం.. రీఫండ్ పోర్టల్ (mocrefund.crcs.gov.in)ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా.. సహారాలో పెట్టుబడి పెట్టినవారంతా.. తమ డబ్బును తిరిగి పొందవచ్చు. 18 జూలై 2023న CRCS సహారా రీఫండ్ పోర్టల్‌ను కేంద్రం ఆరంభించింది.
Sahara Money Refund Process : దీని ప్రకారం పెట్టుబడిదారులందరూ ఈ పోర్టల్‌లో లాగిన్ అయి.. వారి డబ్బును పొందవచ్చు. 10 కోట్ల కంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులకు.. ఈ రీఫండ్ పోర్టల్ ద్వారా తిరిగి డబ్బులను చెల్లించనున్నారు. మరి.. ప్రజలు తమ డబ్బు పొందడానికి ఏం చేయాలి? ఏయే డాక్యుమెంట్స్ కావాలి..? ఎలా క్లెయిం చేసుకోవాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
సహారా రీఫండ్ పొందడానికి అర్హతలు (Sahara Refund Eligibility Rules) :
- మొదటిది మీరు సహారా గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన మీ డబ్బుతో.. సెబీలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ అయి ఉండాలి.
- రెండోది మీరు తప్పనిసరిగా ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతా నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి.
- మీరు అప్లై చేసిన తర్వాత.. మీ దరఖాస్తులను SEBI పరిశీలిస్తుంది.
- మీ దరఖాస్తు సరిగా ఉంటే.. అప్లై చేసిన 45 రోజుల తర్వాత డబ్బు పొందుతారు.
- తొలుత రూ.10 వేల లోపు పెట్టుబడి పెట్టిన వారికి రీఫండ్ చేస్తారు.
- ఆ తర్వాత.. దశల వారీగా ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్తారు.
How to Apply for Sahara Money Refund in Online :
సహారా రీఫండ్ పోర్టల్‌లో ఎలా అప్లై చేయాలి..?
- మొదట మీరు mocrefund.crcs.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఆ తర్వాత మీ 12 అంకెల మెంబర్‌షిప్ నంబర్, ఆధార్ కార్డు చివరి నాలుగు అంకెలు, అలాగే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి.. Get OTPపై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ మొబైల్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి.
- లాగిన్ అయిన తర్వాత.. ఆధార్ ద్వారా ప్రాంప్ట్ కోసం మీ సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత నెక్ట్స్ పేజీలో I Agree అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్‌కు అంగీకరించాలి.
- అనంతరం మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి.. Get OTPపై నొక్కాలి. ఆ తర్వాత OTP ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
- అక్కడ OTP వెరిఫికేషన్ తర్వాత ఆధార్ యూజర్ డీటెయిల్స్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
- అప్పుడు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్‌పై కనిపించే డీటెయిల్స్ నమోదు చేయాలి. ఆపై Submit Claimపై క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ వివరంగా తెలుసుకోవాలి.
- క్లెయిం డీటెయిల్స్ నమోదు చేసిన తర్వాత.. ప్రీ ఫిల్డ్ క్లెయిం రిక్వెస్ట్ ఫాం అక్కడ ప్రిపేర్ అవుతుంది. దాంట్లో అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
- అనంతరం మీ లేటెస్ట్ ఫొటో పెట్టి.. క్లెయిమ్ ఫాంపై సంతకం చేయాలి.
- ఆ తర్వాత అప్‌లోడ్ డాక్యుమెంట్ అన్న దానిని క్లిక్ చేసి.. క్లెయిం ఫాం, పాన్ కార్డు అప్‌లోడ్ చేయాలి.
- మీరు పొందే క్లెయిం అమౌంట్ 50 వేల రూపాయల కంటే ఎక్కువ ఉంటే పాన్ కార్డు తప్పనిసరి
- అలాగే మీ క్లెయిమ్ రిక్వెస్ట్ నంబర్ తప్పనిసరిగా నోట్ డౌన్ చేసుకోవాలి. భవిష్యత్తులో రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది.
- మీకు సహారా రీఫండ్ పోర్టల్ గురించి ఇంకా ఏమైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే.. https://mocrefund.crcs.gov.in/Faq# అనే లింక్‌పై క్లిక్ చేయండి. తరచుగా అడిగే సందేహాలు-సమాధానాలు ఇక్కడ కనిపిస్తాయి.
PM Kisan 15th Installment 2023 : పీఎం కిసాన్ 15వ విడత డబ్బులు.. జాబితాలో మీరున్నారా? ఇలా చెక్ చేయండి!
EPF Advance For Marriage : పెళ్లి కోసం డబ్బులు కావాలా?.. ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందండిలా!