Rupee value falling: రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. బుధవారం కాస్త కోలుకున్న రూపాయి.. గురువారం ఇంట్రాడేలో 13 పైసలు బలహీన పడింది. దీంతో జీవితకాల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. గురువారం ట్రేడింగ్లో అమెరికన్ డాలరుతో పోలిస్తే రుపాయి మారకం విలువ 77.74 వద్ద ప్రారంభమైంది. అనంతరం మరింత బలహీనపడి 77.81కి పడిపోయింది. తద్వారా బుధవారం సెషన్ క్లోజింగ్ స్థాయితో పోలిస్తే 13 పైసలు కోల్పోయింది.
కాగా, బుధవారం రుపాయి విలువ 10 పైసలు బలపడంది. అంతకుముందు రికార్డు స్థాయి కనిష్ఠం నుంచి కోలుకొని బుధవారం 77.68కి ఎగబాకింది.
మరోవైపు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 0.12 డాలర్లు పడిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర రూ.123.43గా ఉంది. ఇదిలా ఉంటే డాలర్ ఇండెక్స్ కాస్త పుంజుకొని 102.55 వద్ద కొనసాగుతోంది.