Rupee Depreciation : రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. తాజాగా రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే 61 పైసలు క్షీణించి రూ.83.01కి చేరుకుంది. విదేశీ మార్కెట్లలో డాలర్ బలపడడం.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడమే రూపాయి పతనానికి కారణమని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Stock Market Close : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగోరోజైన బుధవారమూ లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల సెగ తగిలింది. అయినప్పటికీ లాభాలను మాత్రం నిలబెట్టుకోగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు మద్దతుగా నిలిచాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగిరావడం కూడా సెంటిమెంటును పెంచింది. అయితే, రూపాయి విలువ మరోసారి క్షీణించడం సూచీల లాభాలను కట్టడి చేసింది.
ఉదయం సెన్సెక్స్ 59,196.96 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,399.69 - 58,961.77 మధ్య కదలాడింది. చివరకు 146.59 పాయింట్లు ఎగబాకి 59,107.19 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25.30 పాయింట్ల లాభంతో 17,512.25 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి 82.91 వద్ద నిలిచింది. సెన్సెక్స్30 సూచీలో 10 షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టైటన్ షేర్లు లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, మారుతీ, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా నష్టపోయాయి.
Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.150 తగ్గి ప్రస్తుతం రూ.51,750గా ఉంది. కేజీ వెండి ధర రూ.700 తగ్గి.. రూ.57,100 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,750గా ఉంది. కిలో వెండి ధర రూ.57,100 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,750 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,100గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,750గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,100 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,750 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,100 వద్ద కొనసాగుతోంది.