తెలంగాణ

telangana

ETV Bharat / business

RIL AGM News : రిలయన్స్ ఏజీఎం భేటీ.. ఇషా, ఆకాశ్, అనంత్​కు కీలక పదవులు - రిలయన్స్ 46వ ఏజీఎం

RIL AGM News In Telugu : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ 46వ వార్షిక సాధారణ సమావేశం (RIL AGM) ప్రారంభమైంది. ఈ సమావేశంలో రిలయన్స్ జియో ఐపీఓ, రిలయన్స్ రిటైల్​ ఐపీఓ, జియో 5జీ రోల్​అవుట్​ మొదలైన అంశాలకపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

46th Annual General Meeting of Reliance Industries Limited
RIL 46th AGM

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 2:24 PM IST

Updated : Aug 28, 2023, 3:28 PM IST

RIL AGM News 2023 : ప్రముఖ వ్యాపారవేత్త, అపరకుబేరుడు ముకేశ్ అంబానీ తన వారసత్వ పగ్గాలను.. తన ముగ్గురు బిడ్డలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్​ బోర్డులో ఇషా, ఆకాశ్​, అనంత్​లకు కీలక పదవులు కట్టబెట్టారు.

46వ ఏజీఎం
రిలయన్స్ ఇండస్ట్రీస్​ 46వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఆగస్టు 28న ముంబయిలో జరిగింది. ఈ సమావేశంలో ఇషా, ఆకాశ్​, అనంత్​లను కంపెనీ బోర్డులో నాన్​-ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్టాక్​ ఎక్స్ఛేంజ్​ ఫైలింగ్​లో స్పష్టంగా తెలిపారు.

జియో - అకాశ్​ అంబానీ
66 ఏళ్ల ముకేశ్​ అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి గతేడాది భారతదేశపు అతిపెద్ద మొబైల్​ సంస్థ రిలయన్స్​ జియో ఇన్ఫోకామ్​ లిమిటెడ్​ బాధ్యతలను అప్పగించారు.

ఇషా, అనంత్​
ఆకాశ్​ అంబానీ కవల సోదరి ఇషా.. రిలయన్స్​ రిటైల్​ బిజినెస్​ను నిర్వహిస్తున్నారు. అనంత్​ అంబానీ న్యూ ఎనర్జీ బిజినెస్​ను చూసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ జియో ప్లాట్​ఫామ్స్​ అన్నీ ముకేశ్ అంబానీ నేతృత్వంలోనే కొనసాగుతుండడం విశేషం.

బోర్డు నుంచి వైదొలిగిన నీతా అంబానీ
నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆమె రాజీనామాను రిలయన్స్ బోర్డ్ ఆమోదించింది. ఓ వైపు తమ వారసులు రిలయన్స్ బోర్డులో కీలక పదవులు చేపట్టిన క్షణంలోనే.. నీతా అంబానీ బోర్డు నుంచి తప్పు కోవడం విశేషం. అయితే నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​గా మాత్రం కొనసాగుతారు.

రిలయన్స్​ జియో 5జీ సర్వీస్​
రిలయన్స్​ జియో 5జీ సర్వీసులు 2023 డిసెంబర్​లోగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని ఆ కంపెనీ ఛైర్మన్​ ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఆల్ట్రా హై-స్పీడ్ ఇంటర్నెట్​ సర్వీస్​లు అందించడానికి తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా చాలా వేగంగా ఈ 5జీ సేవలను విస్తరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

జియోఎయిర్ ఫైబర్​
2023 సెప్టెంబర్​ 19 గణేశ్​ చతుర్థి రోజున జియోఎయిర్​ఫైబర్ను లాంఛ్ చేస్తున్నట్లు.. రిలయన్స్ ఇండస్ట్రీస్​ 46వ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో ఆయన పేర్కొన్నారు.

జియో కస్టమర్​ బేస్​
ఏజీఎంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. 'జియో వినియోగదారుల సంఖ్య 450 మిలియన్లు దాటింది. ఇప్పటికే ప్రధానమైన పట్టణాల్లో, నగరాల్లో 96 శాతం వరకు 5జీ నెట్​వర్క్​ సేవలు అందిస్తున్నాం. ఈ విధంగా సంవత్సరానికి 20 శాతానికి పైగా ఆదాయవృద్ధిని సాధించాం. అంతేకాదు ఈ ఏడాది డిసెంబర్​లోగా దేశవ్యాప్తంగా పూర్తిగా ఈ 5జీ సేవలు విస్తరిస్తాం' అని తెలిపారు.

డిజిటల్ ఇండియా
'జియో సేవలను 7 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. దీని ద్వారా భారతదేశాన్ని ప్రీమియర్​ డిజిటల్​ సొసైటీగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. అలాగే భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్​ఫ్రాస్ట్రెక్చర్​ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం.' అని ముకేశ్​ అంబానీ ఆర్​ఐఎల్​ ఏజీఎంలో పేర్కొన్నారు.

150 బిలియన్ డాలర్ల పెట్టుబడి!
రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ గత 10 ఏళ్లలో 150 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిందని రిలయన్స్ ఛైర్మన్​ ముకేశ్ అంబానీ తెలిపారు. తాము అసాధ్యమని అనుకునే లక్ష్యాలను నిర్దేశించుకుని.. వాటిని సుసాధ్యం చేశామని వెల్లడించారు.

మార్కెట్ వర్గాల ఆసక్తి!
జియో ఫైనాన్సియల్​ సర్వీసెస్​ ఇటీవలే స్టాక్​మార్కెట్​ ట్రేడింగ్ ప్రారంభించింది. కానీ ప్రారంభంలోనే ఆ షేరు కాస్త తడబాటుపడుతోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ గ్రూప్​లోని ఇతర విభాగాల లిస్టింగ్​పై ముకేశ్ అంబానీ ఏం ప్రకటిస్తారో అని.. మార్కెట్​ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Last Updated : Aug 28, 2023, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details