Revolt Rv400 EV :ప్రముఖ విద్యుత్ బైక్‌ల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్.. సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. రివోల్ట్ మోటార్స్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా RV400 పేరుతో ఈ స్టెల్త్ బ్లాక్ ఎడిషన్ ఈవీ బైక్‌ను లాంఛ్ చేశారు.
Revolt Rv400 EV Features :స్పోర్ట్స్ బైక్‌ను తలపించేలా ఉన్న ఈ బైక్‌ను.. స్టైలిష్ అండ్ డైనమిక్ లుక్స్‌తో తీర్చిదిద్దారు. స్టెల్త్ బ్లాక్ ఎడిషన్( Revolt Rv400 Stealth Black Edition ).. పేరుకు తగ్గట్టే రివోల్ట్ RV400లో స్టైలిష్ లుక్ కలిగిన స్లీక్ బాడీని గమనించవచ్చు. బైక్‌కు మరింత అందాన్ని తెచ్చే విధంగా ముందు భాగంలో గోల్డ్ కలర్లో రెండు ఫోర్క్‌లను కూడా అమర్చారు. ఇది బైక్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఇందులోని స్టైల్డ్ ఎల్ఈడీ హెడ్‌లైట్.. బైక్‌కు మరింత మోడ్రన్ లుక్‌ను అందిస్తోంది. ఇక బాడీవర్క్ విషయానికొస్తే.. బ్యాటరీ బయటకు కనిపించకుండా యాంగులర్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఇక రివోల్ట్ RV400 బైక్ పనితీరు విషయానికి వస్తే.. ఈ స్టెల్త్ బ్లాక్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్లోని ఫీచర్లనే ఇందులోనూ ఉన్నాయి. ఇందులో మిడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను వాడారు. దీనితో అటవీ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన రైడ్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ చెబుతోంది.