తెలంగాణ

telangana

ETV Bharat / business

Millennials Retirement Plan : మీరు మిలీనియల్స్​ అయితే.. పదవీ విరమణ కోసం ఇలా ప్లాన్​ చేసుకోండి! - యువత పదవీ విరమణ ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి

Retirement Planning For Millennials : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ పదవీ విరమణ కోసం ముందుగానే ప్లాన్​ చేసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా మిలీనియల్స్ తమ రిటైర్​మెంట్​ కోసం ప్లాన్​ చేసుకోవడం అత్యవసరం. అందుకే మీరు మీ పదవీ విరమణ ప్రణాళికను ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి.

Financial Planning For Millennials
Retirement planning for millennials

By

Published : Jul 23, 2023, 7:05 PM IST

Financial Planning For Millennials : నేటి యువతకు ఉపాధి అవకాశాలు చాలానే దొరుకుతున్నాయి. వారు ఉద్యోగంలో చేరిన వెంటనే తక్షణ సమస్యలపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ భవిష్యత్​ ఆర్థిక అవసరాలపై కూడా వారు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి మునుపటి తరాలతో పోల్చి చూస్తే, నేటి మిలీనియల్స్​కు చాలా ప్రత్యేకమైన ఆర్థిక సవాళ్లు ఎదురువుతున్నాయి.

మిలీనియల్స్ అంటే ఎవరు?
Who are called millennials : 1981 నుంచి 1996 సంవత్సరాల మధ్యలో జన్మించినవారిని సాధారణంగా మిలీనియల్స్ అంటారు. భారతదేశంలో ఈ మిలీనియల్స్ జనాభా చాలా ఎక్కువనే చెప్పాలి. వీరి జీవన వ్యయం, విద్యా ఖర్చులు, రుణాలు మునుపటి తరాలతో పోల్చితే చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. నిరుద్యోగం తాండవిస్తున్న నేటికాలంలో.. ఉద్యోగాల విషయంలో వీరు ఇతరుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో మునుపటి తరాలతో పోల్చితే.. వీరికి సరికొత్త రంగాల్లో అవకాశాలు కూడా అధికంగానే లభిస్తున్నాయి.

వాస్తవానికి ఈ మిలీనియల్స్​ మునుపటి తరాలతో పోల్చితే బాగా విద్యావంతులు. సాంకేతికంగా కూడా బాగా ముందంజలో ఉన్నారు. అందుకే వీరికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా లభిస్తున్నాయి. అయితే నేటి కాలంలో పెన్షన్​ విధానం దాదాపు తెరమరుగైంది. అందువల్ల మిలీనియల్స్​ తమ రిటైర్మెంట్ ప్రణాళిక గురించి ఇప్పటి నుంచే ఆలోచించాలి. లేదంటే భవిష్యత్ అభద్రతకు లోనవుతుంది. అందుకే ఈ మిలీనియల్స్​ తమ పదవీ విరమణ ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

సరైన బడ్జెట్ వేసుకోవాలి!​
Millennial budget plan : బడ్జెట్​ రూపొందించుకోవడం అనేది ఒక కీలకమైన అంశం. ముందుగా వ్యక్తులు తమ నెలవారీ ఆదాయం, ఖర్చుల జాబితాను తయారుచేసుకోవాలి. వాటిలో అవసరమైన, అనవసరమైన ఖర్చులను వర్గీకరించుకోవాలి. దీని వల్ల డబ్బు ఆదా చేసే అంశాలను వేగంగా గుర్తించడానికి వీలవుతుంది. అలాగే ఎంత మేరకు పొదుపు చేయాలి. ఎంత మేరకు ఖర్చు చేయాలి? అనే అంశంలో స్పష్టత వస్తుంది.

బడ్జెట్​లోనే భవిష్యత్ అవసరాలకు అవసరమైన పెట్టుబడులకు కొంత కేటాయించుకోవాలి. ఇది మీ భవితకు భరోసా ఇస్తుంది. బడ్జెట్, పొదుపు, పెట్టుబడి, పదవీ విరమణ ప్రణాళిక, పన్నులు లాంటి వ్యక్తిగత ఆర్థిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి.

రుణాలు, వడ్డీలపై దృష్టి కేంద్రీకరించండి!
ప్రస్తుత కాలంలో ఏది కొనాలన్నా, ఏం చేయలన్నా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ ఉన్నాయి. క్రెడిట్​ కార్డులు అందుబాటులో ఉండడం వల్ల వస్తు, సేవలను చాలా సులభంగా పొందడానికి వీలవుతోంది. కానీ అదే సమయంలో తెలియకుండానే అప్పుల భారం పెరిగిపోతోంది. అందువల్ల అత్యవసరం అయితే తప్ప క్రెడిట్ కార్డు ఉపయోగించకూడదు. ముఖ్యంగా యువత క్రెడిట్​ కార్డు మోజులో పడి అనవసర ఖర్చులు పెంచుకోకూడదు. దీని వల్ల భవిష్యత్​లో మీపై మోయలేని భారం పడుతుంది.

వీలైనంత త్వరగా పొదుపు చేయండి!
Millennial saving habits : ప్రతి నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు తమకు ఉపాధి కల్పించే యజమాని అందించే ఈపీఎఫ్​ ఖాతాతోనే తమ పొదుపును సరిపెట్టుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వాస్తవానికి ఇది వారు సంపాదిస్తున్న మొత్తం ఆదాయంలో 10 శాతం కంటే తక్కువ. ఇది మీ భవిష్యత్​ అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. అందుకే యువత తమ ఆదాయంలో కనీసం 15 నుంచి 30 శాతం వరకు పొదుపు చేసుకోవాలి. అలాగే వీలైనంత త్వరగా పెట్టుబడులు కూడా పెట్టాలి. దీని వల్ల వీరు తక్కువ సమయంలోనే మంచి సంపదను సృష్టించుకోగలుగుతారు.

పెట్టుబడులపై దృష్టి కేంద్రీకరించాలి!
Millennial investing strategy : యువత దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం మ్యూచువల్​ ఫండ్స్​, ఈక్విటీ షేర్స్​, ఎన్​పీఎస్​, ఈపీఎఫ్​, ఈటీఎఫ్​లు, బాండ్లు మొదలైన పెట్టుబడి పథకాలను పరిగణనలోకి తీసుకోవాలి. అదే సమయంలో తమ పెట్టుబడులను డైవర్సిఫై చేయాలి. రిటైర్​మెంట్​ ప్లాన్​ను రూపొందించేటప్పుడు.. ఏ పథకంలో ఎంత శాతం పెట్టుబడి పెట్టాలో ఆర్థిక నిపుణుల సలహాతో ఒక నిర్ణయానికి రావాలి.

ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి!
పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. మీ పొదుపు, పెట్టుబడులపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అందువల్ల మిలీనియల్స్​ తమ సంపాదనను పొదుపు మాత్రమే చేస్తే సరిపోదు. వాటిని పెట్టుబడులుగానూ మలుచుకోవాలి. అలాగే పెట్టుబడి పోర్టుఫోలియోను డైవర్సిఫై చేసుకోవాలి. ఈక్విటీలు, బాండ్లు మాత్రమే కాకుండా మ్యూచువల్​ ఫండ్స్​, రియల్​ ఎస్టేట్​, బంగారంపై పెట్టుబడులు పెట్టేలా చూసుకోవాలి. మార్కెట్ ఒడుదొడుకులకు అనుగుణంగా వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకొని, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలి.

అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి!
Millennials emergency fund creation : పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరూ చెప్పలేరు. అందువల్ల మిలీనియల్స్​ అత్యవసర నిధిని ఏర్పాటుచేసుకోవాలి. ఇది మీ దైనందిన జీవితంలో అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే కాకుండా, ఉద్యోగ నష్టం, వైద్య ఖర్చులు లాంటి ఊహించని ఆర్థిక ఇబ్బందులను కూడా చాలా సునాయాసంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ నిధి కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చుకు సరిపడేంతగా.. ప్రత్యేక పొదుపు ఖాతాలో ఉంచుకోవాలని గుర్తించుకోవాలి.

అదనపు ఆదాయం సమకూర్చుకోవాలి!
Millennials source of income : మీరు సాధారణ ఉపాధి పొందుతున్నప్పటికీ.. మీ వద్ద అదనపు నైపుణ్యాలు ఉండొచ్చు. వాటి ద్వారా మీరు అదనపు ఆదాయ అవకాశాల కోసం ప్రయత్నించడం ఉత్తమం. దీని వల్ల మీ నైపుణ్యాలు మెరుగుపడడం సహా, అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. ఇది మీ భవిష్యత్​కు మరింత భద్రతను చేకూరుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details