Renault Car Launch 2024 : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రెనో (Renault) టైబర్, క్విడ్, కిగర్ 2024 మోడల్ కార్లను మార్కెట్లోకి తెచ్చింది. వీటిలో అనేక ఫీచర్లను యాడ్ చేసింది. ఈ అప్డేటెడ్ కారుల్లో క్విడ్ అనేది ఒక కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్; ట్రైబర్ ఒక కాంపాక్ట్ ఎంపీవీ కార్; కిగర్ ఒక కాంపాక్ట్ సెడాన్. వీటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. Renault Kwid Features : రెనో క్విడ్ 2024 మోడల్ RXL(O) వేరియంట్ AMT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. దీనిలో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ క్విడ్ కారు 3 సరికొత్త డ్యూయెల్-టోన్ కలర్ ఆప్షన్లతో లభిస్తుంది.
Renault Kwid Price : రెనో క్విడ్ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.12 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రైజ్ రేంజ్లో ఉంటుంది.
2. Renault Triber Features : ఈ రెనో ట్రైబర్ కారును కొత్తగా స్టీల్త్ బ్లాక్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్‌తో తీసుకువచ్చారు. దీనిలో డ్రైవర్ సీట్ ఆర్మ్‌రెస్ట్, పవర్డ్ వింగ్ మిర్రర్స్, ఏడు ఆంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ లాంటి అనేక కొత్త ఫీచర్లను పొందుపరిచారు.
రెనో అప్డేటెడ్ ట్రైబర్ RXL వేరియంట్లో రియర్ వైపర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ ఎయిర్‌కండిషనింగ్ వెంట్స్, పీఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్స్‌ను అమర్చారు. ఈ ట్రైబర్ కారు, రెనోకు సంబంధించి భారతదేశంలోనే బెస్ట్ సెల్లర్‌గా ఉంది.