Reliance Metro AG : దేశీయ రిటైల్ రంగ వ్యాపారంలో మరింత బలోపేతం అయ్యేందుకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దూకుడు పెంచింది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాలో 100 శాతం వాటాను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆర్‌ఐఎల్ రిటైల్ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పంద ప్రక్రియ 2023 మార్చి నాటికి పూర్తవుతుందని అంచనావేసింది.
రిలయన్స్ చేతికి 'మెట్రో' వ్యాపారం.. రూ.2,850 కోట్లకు డీల్ - reliance metro cash and carry deal
జర్మనీ సంస్థ మెట్రో క్యాష్ అండ్ క్యారీ భారత్లో సాగిస్తున్న వ్యాపారం 100 శాతం వాటాను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ డీల్ ప్రక్రియ 2023 మార్చినాటికి పూర్తవుతుందని ఇరుసంస్థలు అంచనా వేశాయి.
2003లో భారత మార్కెట్లోకి మెట్రో ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉన్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న రిటైలర్లు వంటి బిజినెస్ కస్టమర్లతో వ్యాపారం నిర్వహిస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో గట్టి పట్టున్న రిలయన్స్.. ఈ హోల్‌సేల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవడం ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి వీలు పడుతుంది. మెట్రో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రెండో రిటైల్ కంపెనీ. మెట్రో మొత్తం 30 దేశాల్లో హోల్‌సేల్, ఫుడ్ రిటైల్ వ్యాపారాల్లో ఉంది.