వారసత్వ ప్రణాళికలో భాగంగా ముకేశ్ అంబానీ రిలయన్స్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. తన కుమార్తె ఈశా అంబానీకి రిటైల్ వ్యాపారం అప్పగించారు. రిటైల్ బిజినెస్ లీడర్‌గా ఆమెను 45వ రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశానికి పరిచయం చేశారు. చిన్న కుమారుడు, 26 ఏళ్ల అనంత్ అంబానీకి రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపార బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ముకేశ్ తెలిపారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి జియో పగ్గాలు అప్పగించారు. ఆ స్థానంలో కొనసాగిన ముకేశ్.. ఈ ఏడాది జూన్ 27నే తన పదవికి రాజీనామా చేశారు.
రిలయన్స్ సంస్ధకు మూడు విభాగాలున్నాయి. జియో, పెట్రోలియం, రిటైల్. తన ముగ్గురు పిల్లలు మూడు బిజినెస్‌ల్లో ఒక్కొకదాంట్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. పెద్ద కుమారుడు ఎప్పటినుంచో జియో సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక సోదరుడు అనంత్ అంబానీ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ పనుల్లో నిమగ్నమయ్యారు. కవల సోదరి ఈశా సైతం రిలయన్స్ రిటైల్‌ను సక్సస్ చేయడంలో కీలక పాత్ర వహించారు. ఇలా ముగ్గురిలోని ప్రతిభను గుర్తించిన ముకేశ్ వారికి ఆయా రంగాలకు సంబంధించిన పగ్గాలను అప్పజెప్పారు.