Reliance SBI Card :దేశంలోని రెండు దిగ్గజ సంస్థలైన ఎస్బీఐ, రిలయన్స్ జతకట్టాయి. రెండు కలిపి కో బ్రాండెడ్‌గా 'రిలయన్స్ ఎస్బీఐ కార్డ్'ను తీసుకురానున్నట్లు ప్రకటించాయి. ఇది మాస్ నుంచి ప్రీమియం వరకు వివిధ రకాల క్రెడిట్ కార్డు అవసరాలను తీర్చడం సహా అన్ని రంగాల వినియోగదారులకు మంచి రివార్డ్ షాపింగ్ అనుభవాన్ని ఇస్తుందని రెండు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
Reliance SBI Credit Card Benefits : రిలయన్స్ రిటైల్‌కు సంబంధించిన దుకాణాల్లో కొనుగోలు చేసిన రిలయన్స్ ఎస్బీఐ కార్డు వినియోగదారులు అనేక రివార్డ్‌లు పొందవచ్చని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఫ్యాషన్ లైఫ్ స్టైల్ నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫర్నిచర్, జ్యూవెలరీ వరకు అనేక విభాగాల్లోని దుకాణాల్లో ఈ సేవలను వినియోగించుకుని రివార్డ్‌లు అందుకోవచ్చని వెల్లడించింది. వీటితో పాటు సాధారణంగా ఎస్బీఐ కార్డు అందించే ఇతర అనేక రివార్డ్‌లు, ఆఫర్లను సైతం రిలయన్స్ ఎస్బీఐ కార్డు వినియోగదారులు పొందవచ్చని తెలిపింది. ఇవే కాకుండా వార్షిక రుసుం మినహాయింపుతో పాటు రిలయన్స్ రిటైల్ స్టోరల్లో షాపింగ్ చేసినందుకు గాను వోచర్స్ కూడా అందుకోవచ్చని చెప్పింది. ఈ భాగస్వామ్యం వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడమే కాకుండా.. భారత క్రెడిట్ కార్డ్ మార్కెట్లో కొత్త మైలురాయిని సృష్టిస్తుందని రెండు సంస్థలు పేర్కొన్నాయి.
Reliance SBi Credit Cards : మరోవైపు, ఈ కార్డులు రెండు రకాలుగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రిలయన్స్, ఎస్బీఐ తెలిపాయి. విభిన్నమైన వినియోగదారుల అవసరాల కోసం ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ రిలయన్స్ ఎస్బీఐ, రిలయన్స్ ఎస్బీఐ ప్రైమ్ కార్డులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పాయి. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ వార్షిక రెన్యూవల్ రుసుం రూ.2,999తో పాటు ట్యాక్స్ ఉండగా.. రిలయన్స్ ఎస్బీఐ కార్డుకు రూ. 499తో పాటు ట్యాక్స్ ఉంటుందని వివరించాయి. అయితే, ప్రైమ్ వినియోగదారులు రూ.3లక్షల విలువైన లావాదేవీలు దాటితే వార్షిక రుసుం మినహాయింపు పొందవచ్చని పేర్కొన్నాయి. కాగా... రిలయన్స్ ఎస్బీఐ కార్డుకు రూ.లక్ష లావాదేవీలు చేస్తే సరిపోతుంది. దీనిని రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో రూపొందించగా.. రూపే సౌజన్యంతో అందుబాటులోకి తీసుకురానున్నారు. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా అనేక రకాల దుకాణాలతో పాటు డిజిటల్ రంగంలోనూ వ్యాపారాలు ఉన్నాయి. రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ సిగ్నేచర్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, జియో మార్ట్, అజియో, రిలయన్స్ జ్యూవెల్స్, అర్బన్ లాడర్, నెట్‌మెడ్స్ సహ అనేక వ్యాపారాలు ఉన్నాయి.
SBI Card Festive Offers 2023 : ఎస్బీఐ కార్డ్ బంపర్ ఆఫర్స్.. 27.5% వరకు క్యాష్‌బ్యాక్.. రూ.10,000 వరకు డిస్కౌంట్!
SBI Card and Bank of Baroda Festive Offers 2023: ఫెస్టివల్ బంపర్ ఆఫర్.. ఏకంగా 10వేల దాకా క్యాష్‌బ్యాక్!