తెలంగాణ

telangana

ETV Bharat / business

Reliance Q2 Results 2023 : Q2లో రిలయన్స్ జోరు.. లాభాల్లో 27శాతం వృద్ధి.. జియో అదుర్స్ - రిలయన్స్​ రెండో త్రైమాసిక ఫలితాలు

Reliance Q2 Results 2023 : ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 27 శాతం లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది.

Reliance Q2 Results 2023
Reliance Q2 Results 2023

By PTI

Published : Oct 27, 2023, 9:33 PM IST

Reliance Q2 Results 2023 : సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 27శాతం లాభాన్ని నమోదు చేసింది దిగ్గజ సంస్థ రిలయన్స్​. ఆయిల్​, గ్యాస్​తో పాటు లైఫ్​స్టైల్​, ఫ్యాషన్​, ఈ కామర్స్​ రంగాలు మెరుగ్గా రాణించడం వల్ల రూ.17,394 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే సమయానికి రూ.13,656 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది రిలయన్స్. ఈ త్రైమాసికంలో సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.2.34 లక్షల కోట్లుగా నమోదైంది.

Reliance Jio Q2 Results :రిలయన్స్​కు చెందిన టెలికాం ఆపరేటర్​ రిలయన్స్ జియో సైతం రెండో త్రైమాసికంలో జోరు ప్రదర్శించింది. 12 శాతం వృద్ధితో రూ. 5,058కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు రెగ్యూలేటరీ ఫైలింగ్​లో పేర్కొంది. గతేడాది ఇదే సమయానికి రూ.4,518కోట్లు సంపాదించినట్లు చెప్పింది. ఆదాయం 9.8 శాతం వృద్ధి చెంది రూ.24,750 కోట్లుగా జియో ప్రకటించింది. దీంతోపాటు జియో ప్లాట్​ఫామ్స్​ కూడా 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. వినియోగదారులు భారీగా పెరగడం వల్ల ఆదాయం రూ. 5,297 కోట్లకు చేరిందని తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,729కోట్ల అదాయాన్ని సంస్థ అర్జించింది.

Non Executive Director Of Reliance Industries :మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వారసులను నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా ఆ కంపెనీ వాటాదారులు ఆమోదించారు. గత ఏడాదే మూడు విభాగాల వ్యాపార నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ముకేశ్‌ అంబానీ వారసులైన ఈశా అంబానీ, ఆకాశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ... ఇకపై నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల హోదాలో వ్యవహరించనున్నారు. రిలయన్స్ కంపెనీ ఈ విషయాన్ని శుక్రవారం స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. వీరి నియామకాన్ని ఆమోదిస్తూ ఆగస్టులోనే కంపెనీ బోర్డు తీర్మానం చేసింది. కవలలైన ఈశా, ఆకాశ్‌ల నియామకానికి 98 శాతం ఓట్లు, అనంత్‌ అంబానీకి 92.75 శాతం ఓట్లతో వాటాదారులు మద్దతు తెలిపారని కంపెనీ పేర్కొంది. ఇటీవల జరిగిన కంపెనీ 46వ వార్షిక సమావేశంలో ముకేశ్‌ అంబానీ తన వారసత్వ ప్రణాళికను వెల్లడించారు. అందులో తమ ముగ్గురు పిల్లలు వ్యాపార నిర్వహణ బాధ్యతలను స్వీకరించనున్నారని ప్రకటించారు.

రిలయన్స్​లో ముకేశ్ అంబానీ​ కంటే.. అత్యధిక వేతనం పొందే వ్యక్తి మీకు తెలుసా?

Mukesh Ambani Children Salary : జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంబానీ పిల్లలు.. మరి వీరికి ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details