తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్ - సింగిల్ ప్లాన్​పై 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు! - Jiotv Premium Plans with 14 Ott Subscriptions

JioTV Premium Plans : మీరు జియో మొబైల్ నెంబర్ వాడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. తొలిసారి రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం.. జియోటీవీ ప్రీమియం పేరిట అదిరిపోయే కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సింగిల్ రీఛార్జ్​ ప్లాన్​తో 14 ఓటీటీలను వినియోగించుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

JioTV Premium Plans
JioTV Premium Plans

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 4:02 PM IST

Jio Launches JioTV Premium Plans :ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో.. జియోటీవీ(JioTV) సబ్​స్క్రైబర్ల కోసం అదిరిపోయే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అనౌన్స్ చేసింది. జియో టీవీ కోసం ప్రీమియం వర్షన్ ప్లాన్స్.. ​జియో తీసుకురావడం ఇదే మొదటిసారి. ఈ కొత్త ప్లాన్స్ ప్రకారం.. జియో ప్రీపెయిడ్‌ యూజర్లు ఏకంగా 14 ఓటీటీలను ఒకే ప్లాన్​తో పొందే అవకాశం కల్పించింది. దీంతో పాటు మూడు వేర్వేరు ప్రీపెయిడ్‌ ప్లాన్లను సైతం జియో(Reliance Jio)లాంచ్‌ చేసింది. వేర్వేరు సబ్‌స్క్రిప్షన్లతో పని లేకుండా ఒకే రీఛార్జ్​పై వివిధ ఓటీటీ సేవలను పొందేందుకు జియోటీవీ ప్రీమియం ప్లాన్‌ ఉపయోగపడనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Reliance Jio Latest Update : రిలయన్స్ జియో.. జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ కోసం 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల కాల వ్యవధిపై మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటి ధరలను వరుసగా రూ.398, రూ.1198, రూ.4,498గా నిర్ణయించింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు పత్రిరోజూ 2GB డేటా, అపరిమిత కాల్స్‌ ఈ ప్లాన్లలో లభిస్తాయి. డిసెంబర్‌ 16 నుంచి ఈ ప్లాన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ప్లాన్లు కేవలం జియో యూజర్లకు మాత్రమే అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.

ప్లాన్ల వారీగా వివరాలు చూస్తే..28 రోజుల గడువు గల రూ.398 సబ్‌స్క్రిప్షన్‌ కింద 12 ఓటీటీ యాప్స్‌ లభిస్తాయి. అదే 84 రోజులు, 365 రోజులు గడువు గల.. రూ.1198, రూ.4498 ప్లాన్ల కింద అయితే 14 ఓటీటీ యాప్స్‌ వస్తాయి. వార్షిక ప్లాన్‌ తీసుకోవాలనుకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. జియో మొబైల్‌ నెంబర్‌ యూజర్లు.. తమ ఫోన్​ నెంబర్​తో ఈ జియో టీవీ ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను పొందొచ్చు. ఒక్కసారి లాగిన్ అయితే.. జియో సినిమా ప్రీమియంతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (మొబైల్‌ ఎడిషన్‌), సన్‌ నెక్ట్స్‌, లయన్స్ గేట్ ప్లే, డాకుబే, హోయిచోయి, డిస్కవరీ+, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, కంచా లంకా, ఎపికోన్ తదితర ఓటీటీ యాప్స్‌ను వీక్షించొచ్చు.

మీరు ఎంచుకునే ప్లాన్లను బట్టి డిస్నీ + హాట్ స్టార్, ప్రైమ్ వీడియో (మొబైల్) యాప్స్ కంటెంట్ కూడా చూడొచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను మైజియో యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేయొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌ను వినియోగించాలంటే నేరుగా జియో నంబర్‌తో లాగిన్‌ అవ్వొచ్చు. మై జియో యాప్‌లో కూపన్‌ సెక్షన్‌లోకి వెళ్లి జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. ఓటీటీలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా అన్నీ టెలికాం సంస్థలు.. ప్రత్యేక ప్లాన్స్​తో ఫ్రీగా వివిధ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లను యూజర్లకు అందిస్తున్నాయి. జియో యూజర్లకు ఇప్పటికే జియోటీవీ, జియో సినిమాలాంటి ఆ కంపెనీకి చెందిన యాప్స్ ఫ్రీయాక్సెస్ ఉండగా.. తాజా ప్లాన్స్ ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు కూడా అందిస్తోంది.

రూ.15వేలకే ల్యాప్​టాప్​ - 'క్లౌడ్'​తో రిలయన్స్ జియో మేజిక్ - మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే?

రిలయన్స్​ జియో నుంచి సరికొత్త డివైజ్​-నిమిషాల్లో మీ పాత కారు మరింత స్మార్ట్!

jio Prima 4G Launch and Price : రిలయన్స్ జియో నుంచి సరికొత్త ఫోన్.. ధర తక్కువ.. వాట్సాప్, యూట్యూబ్​తో పాటు మరెన్నో ఫీచర్లు..!

ABOUT THE AUTHOR

...view details