Bella collection reliance: భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్ కొత్తగా బెల్లా కలెక్షన్‌ను ప్రారంభించింది. ఈ తరం 'జనరేషన్ జడ్' మహిళలకు ప్రతిరోజును ప్రత్యేకంగా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఈ కలెక్షన్‌ను రూపొందించింది. సున్నితంగా ఆధునికంగా ఉండే డిజైన్లతో తయారు చేసింది. రోజ్ గోల్డ్ కంటే తక్కువ విలువైన రంగు రాళ్ళతో అద్భుతమైన ఆభరణాల కలెక్షన్‌ను ప్రారంభించారు.
మహిళకు ప్రతీరోజు స్పెషల్‌గా అనిపించేలా బెల్లా కలెక్షన్లో డ్యాష్ ఆఫ్ కలర్‌ను చేర్చి వీటిని డిజైన్ చేశారు. ఈ ప్రత్యేక కలెక్షన్లోని ఆభరణాలు సున్నితంగా, కాలానుగుణంగా ఉంటాయి. ఇవి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు లేదా సాధారణ విందులకు హాజరయ్యేటప్పుడు కూడా బాగుంటాయి. లారియట్ స్టైల్లోని ఈ నెక్‌వేర్, తేలికైన చెవిదుద్దులను రోజూ ధరించే భారీ డిజైన్ ఆభరణాలకు ప్రత్యామ్నాయంగా కోరుకుంటున్నారు మహిళలు. ఈ అందమైన కలెక్షన్‌ను పార్టీలతో మొదలై స్నేహితులతో షాపింగ్ వంటి మీ దైనందిన పనులకు.. చిన్న చిన్న విహార యాత్రల నుంచి బ్రంచెస్ వరకు.. ఇంట్లో చిన్న చిన్న వేడుకల నుంచి వారాంతపు పార్టీలకు ఇలా అన్నిటికి సెట్ అవుతుంది.
ఈ కలెక్షన్లో నెక్లేసులు, బ్రేస్లెట్లు, చెవిదుద్దుల కొత్త డిజైన్లు 14క్యారెట్ల రోజ్ గోల్డ్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. ఈనాటి మహిళలు ఉత్తమమైనవిగా భావించే పెరీడాట్ ఆకుపచ్చ, అమెథిస్ట్ పర్పుల్ రంగుల కంటే తక్కువ విలువ గల రంగు రాళ్ళు ఉన్నాయి. రత్నాలు సురక్షితంగా ఉండే విధంగా ప్రత్యేక బెజెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కలెక్షన్ ధరలు రూ.5,500 నుంచి ప్రారంభం కావడం వల్ల అందరికీ అందుబాటులో ఉంటాయి.