Reliance Chairman Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మరో 5 ఏళ్లపాటు ముకేశ్ అంబానీయే కొనసాగనున్నారు. ఈ మేరకు కంపెనీ షేర్ హోల్డర్లు తీర్మానం చేశారు. దీనితో 2029 ఏప్రిల్ వరకు ముకేశ్ అంబానీ రిలయన్స్ హెడ్ పనిచేయనున్నారు. కానీ ఈ సమయంలో ఆయన ఎలాంటి జీతం తీసుకోకుండా పనిచేస్తానని చెప్పడం విశేషం.
బిగ్ బాస్
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీని ముకేశ్ అంబానీ అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే షేర్ హాల్డర్లు ఆయననే కంపెనీ ఛైర్మన్ అండ్ ఎమ్‌డీగా కొనసాగించాలని నిర్ణయించారు. అయితే కంపెనీ లా ప్రకారం, ఒక వ్యక్తి 70 ఏళ్ల వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగగలరు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ వయస్సు 66 సంవత్సరాలు. అందుకే కంపెనీ షేర్ హోల్డర్లు ప్రత్యేక తీర్మానం చేసి, ఆయనను 2029 ఏప్రిల్ వరకు రిలయన్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు.
ధీరూభాయి తరువాత!
ముకేశ్ అంబానీ 1977లో రిలయన్స్ ఇండస్ట్రీలో చేరారు. 2002 జులైలో తన తండ్రి ధీరూభాయి అంబానీ మరణించిన తరువాత.. కంపెనీ ఛైర్మన్‌గా ముకేశ్ అంబానీ పగ్గాలు చేపట్టారు.
ప్రత్యేక తీర్మానం!
Reliance special resolution latest news : 2023 జులై 21న రిలయన్స్ కంపెనీ షేర్ హోల్డర్లు ప్రత్యేక తీర్మానం చేసారు. దీనితో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు.. ముకేశ్ అంబానీని రిలయన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా రీ-అపాయింట్ చేశారు. ముకేశ్ అంబానీ ప్రస్తుత టెర్మ్ 2024 ఏప్రిల్ 18తో ముగుస్తుంది. అయితే 2019 ఏప్రిల్ 19 నుంచి మరో ఐదేళ్లపాటు ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.