రిలయన్స్‌కు చెందిన టెలికాం విభాగం జియో మూడో త్రైమాసికంలో రూ.4,638 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 28.3 శాతం అధికం. మొత్తం ఆదాయం సైతం రూ.19,347 కోట్ల నుంచి రూ.22,993 కోట్లకు పెరిగినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు 134 నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
Q3లో అదరగొట్టిన జియో.. లాభాల్లో 28% వృద్ధి.. ఆదాయం కూడా..
టెలికాం విభాగం జియో మూడో త్రైమాసికంలో రూ.4,638 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 28.3 శాతం అధికం. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ నికర లాభం 15 శాతం క్షీణత నమోదు చేసింది.
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 15 శాతం క్షీణత నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికానికి రూ.18,549 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ఈ సారి రూ.15,792 కోట్లు ఆర్జించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ.1,91,271 కోట్ల నుంచి రూ.2,20,592 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.
కాగా, క్యూ3 ఫలితాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ మాట్లాడారు. సవాలుతో కూడిన వాతావరణంలోనూ వ్యాపార బృందాలు అద్భుతమైన పనితీరును కనబరిచాయని ప్రశంసించారు.