5G spectrum auction: వేగవంతమైన డేటా, నాణ్యమైన టెలికాం సేవలు అందించేందుకు... ఉద్దేశించిన 5జీ స్పెక్ట్రమ్ కోసం లక్షా 50వేల 173 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. మెుత్తం 7రోజుల పాటు 40 రౌండ్లలో జరిగిన బిడ్ల ప్రక్రియ ముగిసింది. 5జీ వేలంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన జియో టాప్‌బిడ్డర్‌గా నిలిచింది. జియో తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా ఉన్నాయి. 4జీ స్పెక్ట్రమ్ రూ.77,815 కోట్లకు అమ్ముడుపోగా... 5జీకి దానికి దాదాపు రెట్టింపు మొత్తం వచ్చింది.
ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.1.50లక్షల కోట్ల బిడ్లు.. జియో టాప్ - 5జీ సేవలు
5G spectrum auction: 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఏడురోజుల పాటు సాగిన వేలంలో రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. జియో, ఎయిర్‌టెల్ టాప్ బిడ్డర్లుగా నిలిచాయి.
5G spectrum auction India: 2010లో జరిగిన 3జీ స్పెక్ట్రమ్.. రూ.50,968 కోట్లకు అమ్ముడైంది. కొత్తగా టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్.. 26మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కోసం వేలంలోకి ప్రవేశించింది. ఏ కంపెనీ ఎంత స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిందో.. వేలం ప్రక్రియ అంతా పూర్తైన తర్వాతే తెలుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశమంతా 5జీ సేవలను విస్తరించాలని భావిస్తుండగా.. వొడాఫోన్-ఐడియా మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితం కానున్నట్లు సమాచారం. ఈనెల14 లోపు స్పెక్ట్రమ్‌ను కేటాయించి, సెప్టెంబరు కల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే అత్యంత నాణ్యమైన వీడియోలను సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ-హెల్త్, కనెక్టెడ్ వెహికల్స్, మెటావర్స్, అధునాతన మొబైల్ క్లౌడ్ గేమింగ్ వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఇదీ చదవండి: