Reasons For Credit Card Limit Decrease : ప్రస్తుతం దాదాపు ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరి దగ్గరక్రెడిట్ కార్డు ఉంటోంది. వీటిని బ్యాంకులు కొంత లిమిట్‌తో తమ కస్టమర్లకు అందిస్తాయి. అయితే వీటిని జారీ చేసే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి బ్యాంకులు. అందులో వ్యక్తి ఆదాయం, సకాలంలో చెల్లింపులు చేయడం లాంటివి ప్రధానంగా ఉంటాయి. వీటి ఆధారంగానే ఇచ్చే క్రెడిట్ కార్డు లిమిట్( Credit Card Limit )లలో మార్పులు చేస్తుంటాయి. ఈ మార్పుల్లో కొన్నిసార్లు మన క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గవచ్చు.. లేదా పెరగవచ్చు కూడా. ఇదిలా ఉంటే.. బ్యాంకులు కొన్ని సార్లు ఉన్నట్టుండి మీ క్రెడిట్ కార్డు పరిమితిని ఒక్కసారిగా తగ్గించేస్తాయి. ఇలా ఎందుకు చేస్తాయంటే..
ఎక్కువగా వాడితే..
Credit Card Limit Low :తమ కస్టమర్ల క్రెడిట్ కార్డు వినియోగంపై బ్యాంకులు నిరంతరం నిఘా ఉంచుతాయి. ఫిక్స్ చేసిన క్రెడిట్ పరిమితిలో ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు? అనేదాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. ఉదాహరణకు ఒక కస్టమర్‌కు రూ.2 లక్షల వరకు క్రెడిట్ కార్డు పరిమితి( Credit Limit ) ఉందనుకోండి.. అందులో రూ.60,000-రూ.80,000 వరకు ఖర్చు చేస్తే పెద్దగా పట్టించుకోవు. అదే జారీ చేసిన లిమిట్‌లో రూ.1,50,000కి పైగా నిత్యం వినియోగిస్తే.. మిమ్మల్ని రిస్కీ కస్టమర్‌గా భావించి వెంటనే క్రెడిట్ లిమిట్‌ను తగ్గించేస్తాయి.
కార్డు వాడకపోయినా..
Credit Card Limit Check : క్రెడిట్ కార్డును దీర్ఘకాలంపాటు వాడకుండా ఉండేవాళ్లు కూడా క్రెడిట్ పరిమితి సమస్యను ఎదుర్కొంటారు. ఇన్-యాక్టివేటెడ్ క్రెడిట్‌కార్డుల నుంచి సదరు బ్యాంకులకు ఎటువంటి ప్రయోజనాలు ఉండవు కనుక.. యాక్టివ్‌గా లేని కార్డుదారుల లిమిట్‌పై కూడా బ్యాంకులు కోత విధిస్తాయి.