కార్డుల మంజూరు కోసం జారీ చేసిన మార్గదర్శకాలను మరో మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కస్టమర్ల అంగీకారం లేకుండా కొత్త కార్డులను యాక్టివేట్ చేయవద్దనే ఉద్దేశంతో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు గతంలో మార్గదర్శకాలను జారీ చేసింది ఆర్బీఐ. కొత్త నిబంధనలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మార్గదర్శకాలు విడుదల చేసిన సందర్భంలో వెల్లడించింది. అయితే బ్యాంకుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్త నిబంధనల అమలును వాయిదా వేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్. అక్టోబర్ 1 నుంచి వీటిని తిరిగి అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
కార్డుల జారీపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆ మార్గదర్శకాల అమలు వాయిదా - nbfc news
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల జారీ కోసం తీసుకొచ్చిన మార్గదర్శకాలపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. కొత్త నిబంధనలు అమలును మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
ఆర్బీఐ తీసుకొచ్చిన తాజా నిబంధనల్లో క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ ప్రధానాంశంగా ఉంది. కార్డ్ జారీ చేసే సంస్థ.. యాక్టివేట్ చేయడానికి వినియోగదారుడి నుంచి.. వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా సమ్మతిని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాక్టివేట్ చేసుకోనట్లయితే.. కస్టమర్ నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా క్రెడిట్ కార్డ్ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. ఇలాంటి.. పలు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఆర్బీఐ. వాటిని అక్టోబర్ 1 నుంచి జారీ చేయాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి:మాంద్యం వస్తే ఏం చేయాలి? ఆర్థిక భద్రతకు ఎలా సన్నద్ధమవ్వాలి?