తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ కీలక నిర్ణయం.. యథాతథంగా వడ్డీ రేట్లు

RBI Repo Rate : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 6.5 శాతంగా ఉన్న రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు గవర్నర్ శక్తికాంత దాస్​. అంతకుముందు ఫిబ్రవరిలో రెపో రేటును పెంచింది ఆర్​బీఐ. 6.25 శాతం ఉన్న రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు పెంచి 6.5 శాతంగా నిర్ధరించింది.

rbi repo rate hike
rbi repo rate hike

By

Published : Apr 6, 2023, 10:18 AM IST

Updated : Apr 6, 2023, 11:28 AM IST

RBI Repo Rate : వడ్డీ రేట్ల పెంపు విషయంలో అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు సమర్థించినట్లు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 3వ తేదీన ఎంపీసీ సమీక్షా సమావేశం ప్రారంభమైంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రిటైల్​ ద్రవ్యోల్బణం 5.2 శాతం ఉంటుందని లెక్కగట్టింది. బ్యాంకింగ్​, నాన్​ బ్యాంకింగ్​ సంస్థల ఆర్థిక కార్యకలాపాలు బాగున్నాయని చెప్పారు గవర్నర్ శక్తికాంత దాస్​. ఇటీవల అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకింగ్​ రంగం నెలకొన్న సంక్షోభాన్ని ఆర్​బీఐ నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఈ బ్యాంకుల విఫలం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక ఇబ్బందులను ఎదుర్కుంటోందని తెలిపారు.​

ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం విషయంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉన్నామని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ చెప్పారు. UPI వ్యవస్థను విస్తరించడానికి ముందస్తుగా మంజూరైన క్రెడిట్​ లైన్లు నిర్వహించుకునేలా బ్యాంకులకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించే దిశగా ఆర్​బీఐ పనిచేస్తోందన్నారు. క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం వివిధ బ్యాంకుల్లో వెతకడానికి RBI కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. డిపాజిటర్లు యాక్సెస్‌ను మెరుగుపరచడం, విస్తృతం చేయడం కోసం క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం బహుళ బ్యాంకుల్లో వెతకడానికి వీలుగా వెబ్ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా ఆర్‌బీఐ గతేడాది మే నెల నుంచి కీలక వడ్డీరేట్లను పెంచుతూ వస్తోంది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది ఆర్​బీఐ. అంతకుముందు ఫిబ్రవరిలో రెపో రేటును పెంచింది ఆర్​బీఐ. 6.25 శాతం ఉన్న రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు పెంచి 6.5 శాతంగా నిర్ధరించింది. ప్రపంచ బ్యాంక్ తన తాజా 'ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్' (IDU)లో జీడీపీని 2023-24లో 6.6 శాతంగా అంచనా వేయగా.. దానిని 6.3 శాతానికి తగ్గించింది.

ఇవీ చదవండి :రాయల్ ఎన్​ఫీల్డ్​ 'కింగ్​'.. మూతపడాల్సిన బుల్లెట్​కు జీవం.. ఆస్తి ఎంతో తెలుసా?

ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ.. వరల్డ్​లో ఆయన ర్యాంక్ ఎంతంటే..

Last Updated : Apr 6, 2023, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details