తెలంగాణ

telangana

ETV Bharat / business

Guidelines For Bank Defaulters : లోన్ చెల్లించలేదని బ్యాంకులు వేధిస్తున్నాయా?.. ఇలా చేస్తే మీరు బయటపడవచ్చు!

Bank Defaulter Viable Steps In India : బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కాలవ్యవధి ముగిసినా చెల్లించకపోతే, అలాంటి వారిని డిఫాల్టర్లుగా పరిగణిస్తారు. అలాంటప్పుడు రుణ గ్రహీతలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే అలాంటి వారికి ఉపశమనం కలిగించేలా ఆర్‌బీఐ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

personal loan defaulter legal action
Bank loan defaulters

By

Published : Jul 30, 2023, 2:47 PM IST

RBI Guidelines For Bank Defaulters : ఆర్థిక అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలు తీసుకుంటారు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత కాల వ్యవధిలోగా తిరిగి చెల్లించాలి. ఈఎంఐ ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లింపులు చేయాలి. కానీ ఇటీవల చాలా మంది రుణాలు చెల్లించడంలో తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. దీని వల్ల డిఫాల్టర్ రుణాలు బ్యాంకులకు తలనొప్పిగా మారాయి.

CIBIL about bank default cases : కోవిడ్‌ తర్వాత వ్యక్తిగత రుణాలు మరింత పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (సిబిల్) గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల డీఫాల్టర్ రుణాల వల్ల జరిగే నష్టాలపై ఆర్‌బీఐ ఓ హెచ్చరిక కూడా జారీ చేసింది.

రుణగ్రహీతలు ఏం చేయాలి?
వాస్తవానికి రుణం గుడువులోగా చెల్లించకపోతే ఏజెంట్ల నుంచి రుణ గ్రహీతలు వేధింపులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? న్యాయపరమైన సహాయం ఎలా పొందాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

RBI Guidelines For Loan Settlement 2023 : డిఫాల్ట్ కేసులను బ్యాంకులు సానుభూతితో పరిష్కరించాలని ఆర్‌బీఐ సూచించింది. అవసరమైతే ఖాతాదారునికి న్యాయపరమైన సహకారం కూడా అందించాలని స్పష్టం చేసింది. అలాగే డిఫాల్టర్ల కోసం ఆర్‌బీఐ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. రుణాలను చిన్న మొత్తాల్లో తిరిగి చెల్లించడానికి వీలుగా రుణాన్ని రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే కాల వ్యవధిని పెంచుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చింది.

రుణగ్రహీతకు అవగాహన కల్పించాలి
bank loan reschedule : 'డిఫాల్టర్ల పట్ల బ్యాంకులు సానుభూతితో వ్యవహరించాలి. ఘర్షణ పడకుండా కస్టమర్లకు సహకరించాలి. రుణం తిరిగి చెల్లించేలా డిఫాల్టర్లకు అవగాహన కల్పించాలి. సులువుగా రుణం చెల్లించేలా రీపేమెంట్ ప్లాన్‌ను కల్పించడం సహా, రుణాన్ని రీషెడ్యూల్​ చేయాలి. డిఫాల్టర్ల పట్ల దయతో వ్యవహరించడం వల్ల రుణాన్ని రికవరీ చేయడం సులభతరం అవుతుంది' అని ఆర్​బీఐ బ్యాంకులకు దిశానిర్దేశం చేసింది.

సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు
Bank defaulter settlement legal rights : ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగేసినవారు లేదా మోసం చేసిన ఖాతాదారులపై సెటిల్‌మెంట్ లేదా టెక్నికల్ రైట్-ఆఫ్‌లను చేపట్టాలని బ్యాంకులను, ఫైనాన్స్ కంపెనీలను ఆర్​బీఐ ఆదేశించింది. అదే సమయంలో రాజీ సెటిల్‌మెంట్‌కు వచ్చిన రుణగ్రహీతలకు 12 నెలల వ్యవధి తర్వాత కొత్త రుణానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించాలని సూచించింది. ఇక మోసానికి పాల్పడినవారిపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లు చేపట్టాలని నిర్దేశించింది.

డిఫాల్టర్లకు చట్టపరమైన హక్కులు
Bank defaulter legal rights in India : డిఫాల్టర్లకు కూడా కొన్ని చట్టపరమైన హక్కులు ఉంటాయి. బ్యాంకు నుంచి నోటీసు పొందడం సహా, న్యాయ సహాయం కోరేందుకు కూడా హక్కు ఉంటుంది. బ్యాంకులు కూడా వారికి న్యాయపరమైన సహాయం అందించాల్సి ఉంటుంది.

క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం
CIBIL Defaulter List : రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకపోతే.. అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్ తగ్గడం వల్ల బ్యాంకుల నుంచి భవిష్యత్తులో రుణాలను పొందలేరు. అందువల్ల బ్యాంకులను సంప్రదించి రుణాలను రీషెడ్యూల్ చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడకుండా చూసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే త్వరగా రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ క్రెడిట్​ స్కోర్​ 600 కంటే దిగువకు పడిపోతే రుణాలు మంజూరు కావడం కష్టమవుతుంది. ఒకవేళ ఏదైనా సంస్థ రుణాలు ఇచ్చినా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details