భారతీయ రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ పదవికి విరల్ ఆచార్య రాజీనామా చేశారు. ఇంకా ఆరు నెలల పదవీ కాలం ఉండగానే విధుల నుంచి వైదొలుగుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 2017 జనవరిలో మూడేళ్ల పదవీ కాలానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఆచార్య నియమితులయ్యారు.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య రాజీనామా - డిప్యూటీ గవర్నర్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవికి విరల్ ఆచార్య రాజీనామా చేశారు. పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఆరు నెలల గడువు ఉన్నా.. విధుల ఆయన నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా తొమ్మిది నెలల గడువు ఉందనగా గత డిసెంబర్లోనే రాజీనామా చేశారు.
విరల్ ఆచార్య
మరో 9నెలల గడువు ఉండగానే గతేడాది డిసెంబర్లో గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఆర్బీఐకి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వాదనలు వినిపించాయి. ఆ వివాదం గడిచి.. ఆరు నెలలు గడవకముందే మరో ఉన్నతాధికారి ఆర్బీఐ పదవి నుంచి వైదొలగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి : టాబ్లెట్లు వీడి.. లాప్టాప్లపైనే దృష్టి