తెలంగాణ

telangana

ETV Bharat / business

Ratan Tata Leadership : రతన్ టాటాకు గ్యాంగ్‌స్టర్ నుంచి బెదిరింపులు.. అసలు ఏం జరిగింది? - ratan tata biography in telugu

Ratan Tata Leadership : ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నేడు అందరి మన్నలను పొందుతున్నారు. ఒకానొక సమయంలో ఆయనపై ఓ గ్యాంగ్​స్టర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. కానీ రతన్​టాటా చాలా ధైర్యంగా అతని ఎదుర్కొని, జైలు కూడా పంపించారు. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది?

Ratan Tata
రతన్​ టాటా

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 4:09 PM IST

Ratan Tata Leadership : టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయనకు పేరుంది. టాటా గ్రూప్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగానూ రతన్ టాటాను అందరూ గౌరవిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే రతన్ టాటా.. తన కంపెనీల తరపున పేదలను ఆదుకుంటూ ఉంటారు. అందుకే రతన్ టాటాను అందరూ అభిమానిస్తారు.

15 రోజులకే గ్యాంగ్ స్టర్‌ నుంచి బెదిరింపులు
Ratan Tata Business Story : రతన్ టాటా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఒక గ్యాంగ్​స్టర్​తో రతన్ టాటాకు గొడవ జరిగింది. రతన్ టాటాను గ్యాంగ్​స్టర్ బెదిరించడమే కాకుండా టాటా మోటార్స్‌ కంపెనీపై దాడులకు కూడా తెగబడ్డాడు. కంపెనీలో పనిచేసే కార్మికులను బెదిరించి విధులకు హాజరుకాకుండా చేశాడు. 1980వ సంవత్సరంలో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన 15 రోజుల తర్వాత ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. రతన్​ టాటా గతంలో.. తాను ఓ గ్యాంగ్‌స్టర్ వల్ల పడిన ఇబ్బందులు గురించి, అతడిని ఎలా ఎదుర్కొన్నారనే విషయాల గురించి ఓ వీడియోలో తెలిపారు. ఆ వీడియో ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి అప్పట్లో టాటా మోటార్స్‌ కంపెనీలో లేబర్ ఎన్నికలు జరిగేవి. ఆ సమయంలో అసంతృప్తితో ఉన్న కొంత మంది కార్మికులను ఒక గ్యాంగ్‌స్టర్ ప్రేరేపించాడు. లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు.

200 మంది గూండాలతో కార్మికులపై దాడి
Ratan Tata Vs Gangster : గ్యాంగ్‌స్టర్ తన అనచరులైన 200 మంది గూండాలతో కలిసి ప్లాంట్‌లోని 4000 మంది ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడు. తరువాత మరలా బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే ప్లాంట్ వద్ద సదరు గ్యాంగ్‌స్టర్ సమ్మెకు కూడా పిలుపునిచ్చాడు. దీనితో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గ్యాంగ్‌స్టర్ అనుచరుల దాడులతో ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు భయపడి పనిచేయడం మానేశారు. దీనితో రతన్ టాటా నేరుగా రంగంలోకి దిగి గ్యాంగ్‌స్టర్‌ను ఎదుర్కొన్నారు.

ప్లాంట్‌లోనే గడిపిన రతన్ టాటా
Ratan Tata Leadership Qualities :రతన్ టాటా తన ఇంటిని వదిలేసి స్వయంగా ప్లాంట్‌లోనే కొద్దిరోజులపాటు ఉన్నారు. కార్మికులకు ధైర్యం చెబుతూ వారితో పనిచేయించారు. తొలుత గ్యాంగ్‌స్టర్‌ను శాంతి చర్చలకు పిలవాలని రతన్ టాటా భావించారు. కానీ గ్యాంగ్​స్టర్ దాడులకు పాల్పడుతుండటంతో చర్చల ఆలోచనను విరమించుకున్నారు. స్వయంగా ప్లాంట్‌లోనే ఉండి కార్మికులను ధైర్యం చెబుతూ పనిచేయించారు. ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌ను అరెస్ట్ చేయడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలా ఓ గ్యాంగ్‌స్టర్‌ను రతన్ టాటాచాలా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు.

రతన్ టాటాను చంపేందుకు కుట్ర
జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత రతన్ టాటాను చంపేందుకు గ్యాంగ్​స్టర్ కుట్ర పన్నాడు. అయితే దాని నుంచి కూడా రతన్ టాటా తప్పించుకున్నారు. ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న రతన్ టాటా.. తన వ్యాపార మార్గంలో ముక్కుసూటిగా పనిచేస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ.. గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

రతన్ టాటా

ABOUT THE AUTHOR

...view details