Milk Price Increase: అమూల్, మదర్ డెయిరీ బ్రాండ్ పాలు మరింత ప్రియం కానున్నాయి. బుధవారం నుంచి లీటరు పాల ధరను రూ.2 మేర పెంచుతున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.
"ఇంధనం, రవాణా, పశువుల దాణా ఖర్చులు పెరిగాయి. ఫలితంగా పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు ఎగబాకాయి. అందుకే పాల ధర పెంచాల్సి వచ్చింది. రూ.2 పెంపుతో అహ్మదాబాద్, దిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, ముంబయితో సహా అన్ని మార్కెట్లలో అమూల్ గోల్డ్ మిల్క్ అర లీటరు ధర రూ.31కు చేరుకోనుంది. అమూల్ తాజా మిల్క్ ధర రూ.25, అమూల్ శక్తి పాల ప్యాకెట్ ధర రూ.28కు పెరగనుంది" అని ఓ ప్రకటనలో తెలిపింది జీసీఎంఎంఎఫ్.
సామాన్యులకు షాక్, పాల ధరలు పెంపు - మదర్ డెయిరీ పాల ధర
దేశవ్యాప్తంగా బుధవారం నుంచి పాల ధరలు పెంచుతున్నట్లు అమూల్, మదర్ డెయిరీ సంస్థలు ప్రకటించాయి. లీటరుపై 2 రూపాయలు అధికంగా వసూలు చేయనున్నట్లు తెలిపాయి.
Milk Price Increase
"కొత్త ధరలు అన్ని పాల రకాలకు వర్తిస్తాయి. మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర బుధవారం నుంచి రూ.61కి చేరుకోనుంది. డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరు రూ.45కు పెరగనుంది. బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటరు రూ.46 నుంచి రూ.48కు పెంచాం. గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు సుమారు 10-11 శాతం పెరిగాయి. అందుకే ధరలు పెంచాల్సి వచ్చింది" అని మదర్ డెయిరీ అధికారి తెలిపారు.
Last Updated : Aug 16, 2022, 2:40 PM IST