తెలంగాణ

telangana

ETV Bharat / business

వంట గ్యాస్ ధర తగ్గింపు.. క్రెడిట్ కార్డ్స్​పై TDS భారం.. జులై 1న వచ్చే మార్పులివే.. - ఐటీఆర్​ ఫైలింగ్​ 2023

Price Changes From July : జులై నెలలో ఎల్​పీజీ గ్యాస్​, సీఎన్​జీ, పీఎన్​జీ గ్యాస్​ ధరల్లో మార్పులు రానున్నాయి. మరో వైపు క్రెడిట్​ కార్డు వినియోగదారులపై టీడీఎస్​ భారం పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటీఆర్​ దరఖాస్తు చేయడానికి కూడా జులై నెలాఖరే చివరి గడువు. ఇవన్నీ మీ నెలవారీ బడ్జెట్​పై ప్రభావం చూపనున్నాయి. పూర్తి వివరాలు మీరే చూడండి.

Price Changes From July
Gas prices and itr filling

By

Published : Jun 27, 2023, 3:01 PM IST

Price Changes From July : జులై నెలలో మధ్యతరగతి ప్రజల నెలవారీ బడ్జెట్​లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగం కోసం వాడే ఎల్​పీజీ సిలిండర్ల (వంట గ్యాస్​) ధరల్లో మార్పులు రానున్నాయి. అలాగే కమర్షియల్​ గ్యాసెస్​ సీఎన్​జీ, పీఎన్​జీ సిలిండర్ల ధరల్లోనూ మార్పులు వస్తాయి. మరోవైపు క్రెడిట్​ కార్డు వినియోగంపై టీడీఎస్​ విధించేందుకు బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్​ ఫైల్​ చేయడానికి జులై 31 ఆఖరి గడువుగా ఉంది. ఇవన్నీ సామాన్యుల నెల వారీ బడ్జెట్​లో అనేక మార్పులు తీసుకురానున్నాయి.

వంట గ్యాస్​ సిలిండర్​ ధరలు తగ్గుతాయా?
సాధారణంగా ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున ఎల్​పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తూ ఉంటాయి. ఈ సమయంలో కంపెనీలు గ్యాస్​ సిలిండర్​ ధరలను పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటాయి. అందులో భాగంగా జులై నెలలో కూడా వంట గ్యాస్​​ సిలిండర్ల ధరలు మారనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, జులైలో వంట గ్యాస్​ సిలిండర్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

జులై నెలలో వంట గ్యాస్​ ధరలు తగ్గనున్నాయా?

సీఎన్​జీ, పీఎన్​జీ గ్యాస్​ ధరలు పెరుగుతాయా?
జులై నెలలో వాహన వినియోగదారులపైనా భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కమర్షియల్​ గ్యాసెస్​ అయిన సీఎన్​జీ, పీఎన్​జీ గ్యాస్​ ధరల్లోనూ మార్పులు రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల దృష్ట్యా జులైలో సీఎన్​జీ, పీఎన్​జీ గ్యాస్​ ధరలు కాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

సీఎన్​జీ, పీఎన్​జీ ధరలు పెరిగే అవకాశం!

క్రెడిట్​ కార్డ్​లపై టీడీఎస్​ భారం!
Credit card TDS charges : క్రెడిట్​ కార్డ్​ వినియోగదారులపై జులై 1 నుంచి అధిక భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రెడిట్​ కార్డ్ వినియోగంపై టీడీఎస్​విధించనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విదేశాల్లో క్రెడిట్​ కార్డు వాడితే కచ్చితంగా టీడీఎస్​ వసూలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్రెడిట్​ కార్డులపై 7 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే.. బ్యాంకులు 20 శాతం వరకు టీడీఎస్​ వసూలు చేయనున్నట్లు సమాచారం. అయితే విద్య, వైద్య ఖర్చుల కోసం క్రెడిట్​ కార్డు వినియోగిస్తే.. కేవలం 5 శాతం మాత్రమే టీడీఎస్​ వసూలు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

క్రెడిట్​ కార్డులపై టీడీఎస్​ భారం

ఐటీఆర్​ ఫైలింగ్​ మర్చిపోవద్దు
ITR Filling last date : ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్​) దాఖలు చేయడానికి జులై 31 ఆఖరు తేదీ. ఇప్పటికే పలుమార్లు ఈ గడువును పెంచిన ఆదాయపు పన్ను శాఖ ఇకపై దీనిని మరింత పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు. కనుక ఆదాయపు పన్ను కట్టాల్సిన ప్రతి ఒక్కరూ ఆన్​లైన్​లో గానీ, లేదా ఆఫ్​లైన్​లో గానీ ఐటీఆర్​ చెల్లించడం మంచిది.

ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్​ చేయడానికి ఆఖరు తేదీ 2023 జులై 31

ABOUT THE AUTHOR

...view details