తెలంగాణ

telangana

ETV Bharat / business

PPF వర్సెస్​​ FD.. పెట్టుబడికి ఏది బెస్ట్​?.. ఎందులో 'వడ్డీ' ఎక్కువ వస్తుంది? - PPF వర్సెస్​​ FD రూల్స్​

PPF Vs FD : పీపీఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఎందులో పెట్టుబడి పెట్టాలనే దానిపై చాలామందిలో గందరగోళం ఉంటుంది.వాటిల్లో ఏది ఎంచుకుంటే మంచిదనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ppf vs fd which is better
ppf vs fd which is better

By

Published : Jul 23, 2023, 8:44 AM IST

PPF Vs FD : డబ్బులు ఆదా చేసుకోవడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఎక్కువ ఆదాయం కోసం స్టాక్ మార్కెట్, మూచ్యూవల్ ఫండ్స్‌లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కానీ స్టాక్ మార్కెట్‌లలోని హెచ్చుతగ్గుల వల్ల వాటిల్లో పెట్టుబడి పెడితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో తక్కువ ఆదాయం వచ్చినా డబ్బులు సురక్షితంగా ఉండే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు చాలామంది మొగ్గు చూపుతారు

అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్ విధానాల్లో ఏది మంచిది? ఎందులో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది? ఆ రెండింటిల్లో ఏది సురక్షితంగా ఉంటుంది? ఎందులో ఎక్కువ వడ్డీ ఉంటుంది? అనే విషయాలు గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. ఇప్పుడు వాటిల్లో ఏది మంచిదనే విషయం తెలుసుకుందాం.

What Is Difference Detween FD And PPF : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రెండూ సురక్షితమే అని చెప్పవచ్చు. మార్కెట్‌లో ఒడిదొడుకులు వచ్చినా మీ పెట్టుబడికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంకు సూచనల ప్రకారం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. దీని వల్ల బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినవారికి ప్రయోజనముంటుంది. రిజర్వ్ బ్యాంకు ఆధీనంలో బ్యాంకుల కార్యకలాపాలు సాగిస్తాయి. దీంతో మీ డబ్బులకు భరోసా ఉంటుంది.

ఇక పబ్లిక్ ప్రావిడెంట్‌ ఫండ్(పీపీఎఫ్)లో దాచుకోవడం వల్ల కూడా మీ డబ్బులకు భద్రత ఉంటుంది. ఎందుకంటే పీపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వం నడిపించే స్కీమ్. దీని వల్ల మీ పెట్టుబడికి ఎలాంటి ప్రమాదం ఉండదు. రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. దీని కాలవ్యవధి 15 సంవత్సరాలు ఉంటుంది.

బ్యాంకుల బట్టి వడ్డీ రేట్లు
PPF vs Fd Interest Rate : 15 సంవత్సరాల తర్వాత మీకు నచ్చితే మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. మీ కాలవ్యవధి పూర్తయిన తర్వాత వడ్డీతో సహా మీ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్‌లో 7.1 వడ్డీ రేటు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బులకు సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రైవేట్ బ్యాంకుల్లో చేసుకోవచ్చు. ఇందుల్లో వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉంటాయి. దీంతో ఎక్కువ వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందనేది తెలుసుకుని పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధితో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే 3.50 నుంచి 7.50 శాతం ఆఫర్ చేస్తోంది. హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.75 శాతం వరుకు వడ్డీ చెల్లిస్తుంది.

రెండింటిల్లో ఏది మంచిదంటే?
Is PPF Better Than Fd : తక్కువ కాలం పెట్టబడి పెట్టాలని మీరు భావిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవాలి. ఎక్కువ కాల వ్యవధిలో మంచి ఆదాయం రావాలంటే పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details