Recurring Deposit Interest Rates :ఈ రోజుల్లో ఎంత సంపాందించినా.. చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు. రోజురోజుకీ ఖర్చులు పెరిగిపోవడంతోపాటు పలు రకాల కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనం. అందువల్ల.. ఎవరైనా సరే, ఉద్యోగ జీవితం ప్రారంభించిన వెంటనే పొదుపు చేసుకోవడం మొదలు పెట్టాలి. ఇందుకోసం ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా నిర్దిష్ట కాలానికి నెలవారీగా కొంత మొత్తం మనీ కట్టుకుంటూ పోతే.. మంచి వడ్డీ రేటుతో అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చే రికరింగ్ డిపాజిట్(RD) గురించి ఓ సారి చూడండి. రిస్క్‌లేని పెట్టుబడుల విషయంలోనూ ఆర్డీలు ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.
Post Office RD Interest Rates :ఎవరైనా ఈ పెట్టుబడి పథకం కింద నిర్దిష్ట కాలానికి ప్రతి నెలా/త్రైమాసికం/అర్ధ సంవత్సరం నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. ఇప్పుడే కొత్తగా పెట్టుబడి ప్రారంభించాలనుకునే వారికి, స్వల్ప కాలానికి చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా రికరింగ్ డిపాజిట్లు మంచి ఎంపిక. ఇందులోనూ డిసెంబర్ త్రైమాసికంలో పోస్టాఫీస్ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (Post Office 5 Year Recurring Deposit) వడ్డీ రేట్లను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. కొన్ని సేవింగ్స్ స్కీమ్‌ల వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన కేంద్ర ప్రభుత్వం.. కేవలం పోస్టాఫీస్ ఆర్‌డీ(RD) వడ్డీ రేటును మాత్రమే పెంచడం విశేషం. అయితే.. ఇప్పుడు చాలా మందికి బ్యాంకులు, పోస్టాఫీస్ వీటిలో ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం? అనే సందేహం వస్తుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌ని.. దిగ్గజ బ్యాంకులైన SBI, HDFC బ్యాంక్ ఆర్డీలతో పోలిస్తే ఏది బెటర్ అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Post Office RD Vs SBI RD Vs HDFC Bank RD :
పోస్టాఫీస్ ఆర్‌డీ(Post Office RD) :ప్రజలకు ఫిక్స్డ్ డిపాజిట్ల(FD) మాదిరిగానే రికరింగ్ డిపాజిట్(RD) కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పథకం. చిన్న పొదుపును ప్రతి నెలా డిపాజిట్‌గా చెల్లించి గడువు తర్వాత వడ్డీతో సహా పెద్ద మొత్తాన్ని అందుకోవచ్చు. ఇటీవల డిసెంబర్ త్రైమాసికానికి కేంద్రం.. ఐదేళ్ల పోస్టాఫీస్ ఆర్డీపై 20 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ పెంచడంతో.. ప్రస్తుతం 6.5శాతం నుంచి 6.7 శాతానికి వడ్డీరేటు పెరిగింది. ఇది అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలానికి వర్తిస్తుంది. పోస్టాఫీస్ RD లను 5 సంవత్సరాల కాలానికి మాత్రమే అందిస్తుంది.
ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్(SBI RD) :అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ(SBI)లో ఏడాది నుంచి పదేళ్ల కాలపరిమితి వరకు RDలపై 5.75% నుంచి గరిష్ఠంగా 7% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఇది ఫిబ్రవరి 15, 2023 నుంచి అమలులో ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్(HDFC RD) :ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ(HDFC)బ్యాంక్‌లో ఆరు నెలల నుంచి పదేళ్ల కాలవ్యవధి వరకు రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. ఇది ఆర్డీలపై 4.50%నుంచి గరిష్ఠంగా 7% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 24, 2023 నుంచి అమల్లో ఉన్నాయి.