Post Office Monthly Income Scheme Details : సంపాదించే ప్రతి ఒక్కరూ తమ డబ్బులను సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఇందుకోసం ఎక్కువ మంది భారతీయ తపాలా శాఖలో పెట్టుబడి పెడుతుంటారు. ఖాతాదారుల ఆలోచన, పెట్టుబడి సామర్థ్యం దృష్టిలోకి తీసుకొని పోస్టాఫీసు కూడా మంచి పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి.. నెలనెలా మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ మీ కోసమే. పోస్ట్ ఆఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా నెల నెల మంచి ఆదాయం పొందటం ఎలాగో ఇప్పుడు తెలసుకుందాం.
Post Office Monthly Income Scheme : సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(POMIS) మంచి ఎంపిక. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఐదు సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టి ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. ఈ స్కీమ్‌లో సింగిల్, జాయింట్ ఖాతాలను తెరవవచ్చు. దీని కోసం రూ.1,000లతో సేవింగ్ ఖాతాను తెరవాలి. సింగిల్ ఖాతాలో గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదే ఉమ్మడి ఖాతా అయితే రూ.9 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉమ్మడి ఖాతాలో ముగ్గురు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టిన పెట్టుబడిపై ఖాతాదారులందరికీ సమానమైన వాటాను తపాలా శాఖ అందిస్తుంది.
Kisan Vikas Patra : ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బులు డబుల్!
Post Office Monthly Income Scheme 2023 : అంతేకాదు.. మీరు ఎప్పుడైనా ఉమ్మడి ఖాతాను సింగిల్ ఖాతాగా మార్చుకునేందుకు కూడా వీలవుతుంది. అలాగే.. సింగిల్ ఖాతాను ఉమ్మడి ఖాతాగా కూడా మార్చుకోవచ్చు. ఖాతాలో ఎలాంటి మార్పులను చేయడానికైనా సభ్యులందరూ దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తరవాత పెట్టుబడిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఖాతాదారులు తమ అకౌంట్‌కు నామినీ వివరాలు అందించవచ్చు.