PM Kisan Samman Nidhi 2023 : భారతీయ రైతులందరీ శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) యోజన 14వ ఇన్స్టాల్మెంట్ నిధులు జులై 27న విడుదల కానున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు చేరనున్నాయి.
2023 జులై 27న ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని శిఖర్లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. ఇదే సందర్భంగా రైతులతో ముఖాముఖి కూడా జరుపుతారు. ఈ విషయాన్ని పీఎం-కిసాన్ స్కీమ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించడం జరిగింది.
పీఎం-కిసాన్ బెనిఫిట్స్!
PM Kisan Beneficiary Status : కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పీఎం-కిసాన్ యోజనను ప్రారంభించింది. ముఖ్యంగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలతో సహా రైతుల వ్యక్తిగత అవసరాలను తీర్చడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6000 అందిస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మొత్తం మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతులకు అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ 13వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం గమనార్హం.
అర్హులైన రైతులు పీఎం-కిసాన్ నిధుల స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
- స్టెప్ 1 : ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inను ఓపెన్ చేయాలి.
- స్టెప్ 2 : హోమ్ పేజ్‌లోని 'Farmers Corner' సెక్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత దానిలోని 'Beneficiary Status'పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3 : రైతు ఆధార్ నంబర్ లేదా బ్యాంకు అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- స్టెప్ 4 : తరువాత 'Get Data'పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 5 : గెట్ డేటాపై క్లిక్ చేయగానే పీఎం-కిసాన్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ మీకు కనిపిస్తుంది.