Apartment Buying Tips 2023 : తెలుగు రాష్ట్రాలతో సహా, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో భారీగా జనాభా పెరుగుతోంది. దీనికి తోడు చాలా మంది నగరాల్లోనే సెటిల్ అవుతున్న నేపథ్యంలో.. సొంతంగా అపార్ట్మెంట్ లేదా ఫ్లాట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటున్నారు. ఒకవేళ మీరు కూడా అపార్ట్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవండి.
అపార్ట్మెంట్ ధరలు!
Apartment Price Estimation : అపార్ట్మెంట్ అమ్మకం అనేది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎంతో చాకచక్యంగా చేసే భారీ వ్యాపారం. అయితే మనం మన అవసరాలకు అనుగుణంగా అపార్ట్మెంట్/ ఫ్లాట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్.. అపార్ట్మెంట్ పై ఫ్లోర్లను ముందుగా అమ్మకానికి పెడతారు. తర్వాత కింది ఫ్లోర్లను అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ బయర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఫ్లోర్‌ని, ఫ్లాట్‌ని అనుసరించి ధరలు మారుతుంటాయి. కనుక ధరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పై ఫ్లోర్ vs కింది ఫ్లోర్
High Floor vs Low Floor : సాధారణంగా చాలా మంది పై ఫ్లోర్లు తీసుకోవాడానికి ఆసక్తి కనబరచవచ్చు. ఎందుకంటే కింది ఫ్లోర్లలో ఎక్కువ చీడ, పీడల బాధ ఉంటుంది. అదే పై ఫ్లోర్లో అయితే ఈ బాధ పెద్దగా ఉండదు. అలాగే పై ఫ్లోర్లలో ధ్వని కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. మీ చుట్టుపక్కల మంచి అందమైన ప్రదేశాలు ఉంటే, మీరు ప్రకృతి ప్రేమికులు అయితే.. పై ఫ్లోర్‌నే ఎంచుకోవడం మంచిది. అలాగే అపార్ట్మెంట్లోకి వెలుతురు బాగా రావాలని ఆశించేవారు కూడా పై ఫ్లోర్ ఎంచుకుంటే బాగుంటుంది.
అద్దెకు ఇవ్వాలంటే!
Apartment Rent Estimate : ఒక వేళ మీరు ఫ్లాట్‌ని అద్దెకు ఇవ్వాలని అనుకుంటే అప్పుడు కింది ఫ్లోర్‌లోని ఫ్లాట్‌ని ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా ఫ్లాట్ తీసుకునే సమయంలో స్థానిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.