తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్​లో బ్లూటిక్​.. ఫేక్​ అకౌంట్​ తెరిచిన దుండగులు.. కంపెనీకి రూ.లక్ష కోట్లు నష్టం

ట్విట్టర్​ నూతన అధిపతి ఎలాన్‌ మస్క్ ఇటీవల తీసుకొచ్చిన ఓ ఫీచర్​ అమెరికాకు చెందిన ఇలై లిల్లీ అండ్ కంపెనీ అనే ఫార్మా సంస్థకు రూ.1.22 లక్షల కోట్ల నష్టాన్ని తెచ్చింది. ఇలై లిల్లీ పేరిట నకిలీ ఖాతా తెరిచిన దుండగులు.. బ్లూ టిక్‌ను 8 డాలర్లతో కొనుగోలు చేశారు. అంతేకాకుండా సంస్థ పేరిట ట్వీట్‌ చేసి తీవ్ర నష్టాన్ని కలిగించారు.

Twitter Blue tick
ట్విట్టర్ బ్లూటిక్

By

Published : Nov 12, 2022, 10:48 PM IST

అమెరికాకు చెందిన ఇలై లిల్లీ అండ్ కంపెనీ డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను అమ్ముతుంటుంది. ఈ సంస్థ పేరు మీద కొందరు ట్విట్టర్​లో నకిలీ ఖాతా తెరిచారు. 8 డాలర్లతో ఆ అకౌంట్‌కు బ్లూ టిక్ సంపాదించారు. ఆ తర్వాత ఓ తప్పుడు వార్తను అందులో పోస్ట్ చేశారు. ఇకపై అందరికీ తమ కంపెనీ ఉచితంగా ఇన్సులిన్ ఇస్తుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ ప్రభావానికి అసలు సంస్థ షేర్ల ధర 4.37 శాతం పడిపోయింది. దాదాపు రూ.1.22 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఈ ఘటనపై ఇలై లిల్లీ అండ్ కంపెనీ స్పందించింది. ఈ ట్వీట్ ఓ నకిలీ ఖాతా నుంచి వచ్చిందని.. ఇది ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేసిందని క్షమాపణలు కోరింది.

ట్విట్టర్​ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఇటీవల కొత్త సదుపాయం తీసుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం వరకు ట్విట్టర్​లో కేవలం రాజకీయ నేతలు, వార్తా సంస్థలు, నటీనటులు వంటి వారికి మాత్రమే బ్లూ టిక్ సదుపాయం ఉండేది. వారి ఖాతాలను పరిశీలించిన తరువాతనే ట్విట్టర్​ బ్లూ టిక్ ఇచ్చేది. కానీ మస్క్ తీసుకున్న నిర్ణయంతో అందరికీ బ్లూ టిక్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details