పెట్రో బాదుడు.. మరోసారి పెరిగిన చమురు ధరలు - డీజిల్ ధర
Petrol diesel prices: చమురు మార్కెటింగ్ సంస్థలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. మళ్లీ ఇంధన ధరలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80కి చేరగా.. డీజిల్ ధర రూ.98.10గా ఉంది.
Petrol price: దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.61 పైసలకు చేరగా... డీజిల్ ధర రూ.89.87 పైసలకు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 111 రూపాయల 80 పైసలకు చేరగా.. డీజిల్ 98 రూపాయల 10 పైసలకు పెరిగింది. విజయవాడలో పెట్రోల్ 113 రూపాయల 62 పైసలు, డీజిల్ 99 రూపాయల 56 పైసలకు పెరిగింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ 113 రూపాయల 83 పైసలు, డీజిల్ 99 రూపాయల 76 పైసలకు చేరింది. అయిదు రోజుల వ్యవధిలో ఇంధన ధరలు నాలుగుసార్లు పెరిగాయి. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 3 రూపాయల 20 పైసలు పెట్రోల్ ధరలు పెరిగాయి.