తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు - పెట్రోల్ డీజిల్ ప్రిచెస్

Petrol diesel price today: పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్​పై 80పైసల చొప్పున పెంచుతున్నట్లు చమరు సంస్థలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

Petrol diesel price today
Petrol diesel price today

By

Published : Apr 3, 2022, 7:13 AM IST

Petrol diesel price today: పెట్రోల్ ధరల పెరుగుదలకు కళ్లెం పడటం లేదు. గడిచిన 13 రోజుల వ్యవధిలో 11వ సారి పెట్రోల్ రేట్లు పెరిగాయి. దేశరాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసల చొప్పున పెంచుతూ చమురు పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.103.41కు చేరగా.. డీజిల్ ధర రూ.94.67కు పెరిగింది.

• Mumbai Petrol prices: ముంబయిలో పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.118.41కు ఎగబాకింది. డీజిల్ ధర 85 పైసలు అధికమై.. రూ.102.64కు చేరుకుంది.
• 75 పైసల పెరుగుదలతో చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.108.96కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.99.04కు ఎగబాకింది.
• కోల్​కతాలో లీటర్ పెట్రోల్​పై 84 పైసలు, డీజిల్​పై 80పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.113.03గా ఉంది. డీజిల్ ధర రూ.97.82కి చేరింది.

• Petrol Price in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 91 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరపై 87 పైసలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.117.21కు చేరింది. డీజిల్ ధర రూ.103.3కు ఎగబాకింది.
• గుంటూరులో పెట్రోల్ ధర 87 పైసలు ఎగబాకి.. రూ.119.07కు చేరింది. డీజిల్ ధర రూ.84 పైసలు పెరిగి.. రూ.104.78కు చేరుకుంది.
• వైజాగ్​లో 88 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.117.79కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై.. రూ.103.54కు ఎగబాకింది.

ఇదీ చదవండి:ఫిక్స్​డ్​ డిపాజిట్ చేస్తున్నారా? ఇవి తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details