Petrol Price Hike: దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్ ధర రూ.93.07కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూర్లో లీటర్ పెట్రోల్ రూ.117.32, డీజిల్ రూ.103.10కి చేరింది. హైదరాబాద్లో పెరిగిన ధరల అనంతరం లీటర్ పెట్రోల్ రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది.
పెట్రో మోత.. 10రోజుల వ్యవధిలో తొమ్మిదోసారి పెంపు
Diesel Price today: దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 10 రోజుల వ్యవధిలో తొమ్మిదోసారి ధరలు పెరిగాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఎలా ఉందంటే..
పెట్రో మంట.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు