Petrol price hike: పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరను 40 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.41కు చేరుకుంది. డీజిల్ ధర రూ.95.07కు ఎగబాకింది. కాగా, 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది 12వ సారి. మొత్తంగా ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.8.40 మేర పెరిగింది.
• Mumbai Petrol prices: ముంబయిలో పెట్రోల్ ధర 42 పైసలు పెరిగి.. రూ.118.81కు ఎగబాకింది. డీజిల్ ధర 43 పైసలు అధికమై.. రూ.103.05కు చేరుకుంది.
• 38 పైసల పెరుగుదలతో చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.109.32కు చేరుకోగా.. డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ.99.4కు ఎగబాకింది.
• కోల్‌కతాలో లీటర్ పెట్రోల్‌పై 42 పైసలు, డీజిల్‌పై 41పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.113.43గా ఉంది. డీజిల్ ధర రూ.98.21కి చేరింది.