Taking Personnel Loan is Good Idea?: తక్షణ ఆర్థిక అవసరాల నుంచి బయటపడటానికి చాలా మంది వ్యక్తిగత రుణాలు (Personal Loans) తీసుకుంటుంటారు. ఈ రుణాలు (Personnel Loans) ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే క్షణాల్లో వచ్చేస్తుండడంతో.. వెనక, ముందు ఆలోచించకుండా వేలకు వేలు లోన్ తీసుకుంటున్నారు. మరి, ఈ వ్యక్తిగత రుణాలు తీసుకోవటం మంచిదేనా..? సమయానికి చెల్లింపులు జరపకపోతే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయి..?, ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారు..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పర్సనల్ లోన్ తీసుకోకపోవడమే మంచిదట!
Why not take a personal loan..?:కారణం ఏదైనా.. వ్యక్తిగత రుణాలు తీసుకోకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఈ పర్సనల్ లోన్స్ వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఏర్పడుతాయని తెలియజేస్తున్నారు. వ్యక్తిగత రుణాల స్థానంలో ఇతర రుణాలను తీసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోకూడదో తెలియజేస్తూ.. 5 రకాల కారణాలను వివరిస్తున్నారు.
Personal Loan Requirements : పర్సనల్ లోన్ కావాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
1. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి
High Interest Rates:వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. పర్సనల్ లోన్స్‌లో బంగారు రుణాలు, వాహన రుణాలు, ఆస్తి రుణాలపై సుమారుగా వడ్డీ రేట్లు 24 శాతం వరకు ఉంటాయి. సరైన సమయంలో చెల్లించకపోతే రుణం మరింత ప్రియం అవుతుంది. దీనివల్ల మనం కట్టాల్సిన మొత్తం మరింత పెరుగుతుంది. దీంతో.. ఒక్కోసారి సమయానికి చెల్లింపులు చేయలేకపోవచ్చు. ఇదే జరిగితే డిఫాల్టర్ ముద్ర పడుతుంది. ఒక్కసారి డిఫాల్టర్ అని క్రెడిట్ స్కోరులో ముద్ర పడితే.. భవిష్యత్‌లో రుణాలు అందడం కష్టమవుతుంది.
2. ముందస్తు చెల్లింపు ఛార్జీలు చెల్లించాలి
Payment of Prepayment Charges: మీరు ఏదైనా అత్యవసరం రీత్యా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఉంటాయి. అదే ఇతర రుణాలకు ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఉండవు. కాబట్టి, రుణదాతలు డబ్బును రాబట్టుకొనేందుకు చట్టరీత్యా చర్యలు తీసుకొనే హక్కు ఉంటుంది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేందుకు ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పర్సనల్ తీసుకునే ముందు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.