Paytm Offer Free Movie Ticket Vouchers on RuPay Credit Card Transactions: చెల్లింపులను మరింత సులభతరం, విస్తృతం చేసేలా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్.. రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐతో లింక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. సింపుల్‌గా చెప్పాలంటే.. మీ డెబిట్ కార్డును యూపీఐతో లింక్ చేసుకున్నట్టే.. మీ దగ్గరున్న రూపే క్రెడిట్ కార్డ్‌లను కూడా యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. తద్వారా.. RuPay క్రెడిట్ కార్డ్ హోల్డర్లు UPI సర్వీస్ ద్వారా.. చెల్లింపులు చేయవచ్చని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది.
తాజాగా.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మరో ఆఫర్‌ను ప్రకటించింది. యూపీఐతో క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. UPIతో క్రెడిట్ కార్డు లింక్ చేసుకొన్న తర్వాత.. మొదటి రెండు చెల్లింపులు చేసిన వారికి.. సినిమా టికెట్ వోచర్‌లను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. మరి, రూపే క్రెడిట్ కార్డ్‌ను paytm ద్వారా యూపీఐకి ఎలా లింక్ చేసుకోవాలి..? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? మూవీ టికెట్స్ వోచర్ ప్రయోజనాన్ని ఎలా పొందాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
పేటీఎం నయా ఫీచర్‌తో ట్రైన్ టికెట్స్ కన్ఫార్మ్ కావడం గ్యారెంటీ!
RuPay క్రెడిట్ కార్డ్‌ను పేటీఎం ద్వారా UPI కి ఎలా లింక్ చేయాలంటే?
- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని పేటీఎం యాప్‌కి వెళ్లండి.
- ఆ తర్వాత Link RuPay Card to UPI పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌ని జారీ చేసిన బ్యాంకును సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీకు UPI రూపే క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి.
- రూపే క్రెడిట్ కార్డ్‌లోని చివరి 6 అంకెలను నమోదు చేయండి.
- ఇప్పుడు మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని నమోదు చేయండి.
- ఇప్పుడు మీ కార్డ్ UPI PINని సెట్ చేయండి.
- పిన్ సెట్ చేసిన తర్వాత మీ కార్డ్ UPIకి లింక్ చేయబడుతుంది.
- తర్వాత ఎక్కడైనా స్కాన్ చేసి చెల్లింపులు చేయొచ్చు.
How to Find Paytm Payments Bank IFSC Code : పేటీఎం IFSC Code తెలుసుకోండి.. మరింత ఈజీగా మీ చెల్లింపులు చేయండి.!
Paytm ద్వారా UPIకి క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
యూపీఐతో రూపే క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు డెబిట్ కార్డ్ లేకుండానే వ్యాపారుల ఫోన్ నంబర్‌కు గానీ, క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేసి గానీ డబ్బులు పంపుతున్నారు కదా. మీ రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి లింక్ చేయడం వల్ల, పేటీఎం ద్వారా ఇవే ప్రయోజనాలను పొందవచ్చు. అంటే, మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండానే.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్‌ను మరిచిపోయి బయటకు వెళ్లినా, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సులభంగా షాపింగ్ చేయవచ్చు. తద్వారా, క్రెడిట్ కార్డ్‌ను పోగొట్టుకోవడం, బయటి వ్యక్తుల వల్ల కార్డ్ దుర్వినియోగం వంటి నష్టాలను అరికట్టవచ్చు.
యూపీఐకి RuPay క్రెడిట్‌కార్డ్‌ను లింక్ చేసుకున్న తర్వాత.. ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే మొదటి రెండు చెల్లింపులపై రూ.500 విలువైన సినిమా టికెట్ వోచర్‌లను బహుమతిగా ఇస్తామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) ప్రకటించింది. ఆఫర్ కింద, రెండు లావాదేవీలపై రూ.250 విలువైన రెండు మూవీ వోచర్‌లను కంపెనీ బహుమతిగా ఇస్తుంది. ఈ వోచర్‌ను ఎలా ఉపయోగించాలంటే..?
Paytm Card Soundbox Launch : పేటీఎంలో ఇక కార్డ్ పేమెంట్స్‌కు ఛాన్స్.. కొత్త 'సౌండ్‌బాక్స్' లాంఛ్!
- Paytm యాప్‌లో Movie Tickets ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత మీరు చూడాల్సిన సినిమాను సెలెక్ట్ చేసుకొని.. ఏ రోజున చూడాలనుకుంటున్నారో ఆ వివరాలను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత పేమెంట్ చేస్తున్నప్పుడు మీ వోచర్‌లోని ప్రోమో కోడ్‌ని ఎంటర్ చేయండి.
- ఒక లావాదేవీలో కేవలం 1 వోచర్‌ను మాత్రమే పొందడానికి వీలుంటుంది.
- సినిమా టిక్కెట్ కనీస ధర 100 రూపాయలు ఉంటేనే ఇది వ్యాలిడ్ అవుతుంది.
How to set Payment Reminders in UPI Apps : యూపీఐ యాప్స్‌లో.. పేమెంట్ రిమైండర్స్ సెట్ చేసుకోండిలా..!
IRCTCలో రైలు టికెట్స్ బుక్ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!