Paytm Card Soundbox Launch :పేటీఎం బ్రాండ్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ సెప్టెంబర్ 4న సరికొత్త కార్డ్ సౌండ్‌బాక్స్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా అన్ని వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, రూపే కార్డులతో.. సులువుగా నగదు చెల్లింపులు చేసుకోవడానికి వీలవుతుంది. దీనితో పాటు మొబైల్ చెల్లింపులు కూడా యథావిధిగా చేసుకోవడానికి వీలు ఉంటుంది.
యూపీఐ పాపులారిటీ
UPI Payment Sound Box : భారతదేశంలో నేడు యూపీఐ చెల్లింపులు బాగా విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ చాలా సులువుగా యూపీఐ ద్వారా రిటైల్ డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అందుకే దీనిని మరింత ముందుకు తీసుకుపోవడానికి పేటీఎం సరికొత్త సౌండ్‌బాక్స్‌ను ఆవిష్కరించింది.
కార్డ్ బేస్డ్ పేమెంట్స్!
Paytm Card Soundbox Payments :ఇప్పటి వరకు చిరువ్యాపారులు.. మొబైల్ ఫోన్ ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. కానీ పేటీఎం తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ సౌండ్‌బాక్స్‌తో.. కార్డ్ పేమెంట్స్ కూడా పొందడానికి వీలవుతుంది. ముఖ్యంగా వినియోగదారులు 'టాప్ అండ్ పే' విధానం ద్వారా తమ కార్డును ఉపయోగించి చాలా సులువుగా నగదు చెల్లించడానికి వీలవుతుంది. ఇది వ్యాపారులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది.
ఆడియో అలర్ట్
Paytm Card Based Sound Box Audio Alert : పేటీఎం సౌండ్‌బాక్స్ ద్వారా కార్డ్ లేదా మొబైల్ ఉపయోగించి నగదు చెల్లింపులు చేసినప్పుడు.. వెంటనే ఆ విషయం ఆడియో ద్వారా వినబడుతుంది. దీనితో నగదు చెల్లింపు జరిగిందా? లేదా? అని డివైజ్‌లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి 2019లోనే పేటీఎం.. ఆడియో బేస్డ్ పేమెంట్ కన్ఫర్మేషన్ సౌండ్ బాక్స్‌ను తీసుకొచ్చింది. భారతదేశంలో ఈ విధానం తీసుకొచ్చిన తొలి కంపెనీ పేటీఎం. తరువాత మిగతా కంపెనీలు దీనిని అనుసరించాయి.