Paying Home Rent Through Credit Card :బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లను అందించడంతో దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఆన్‌లైన్ షాపింగ్‌లు, మొబైల్ రీఛార్జ్‌లు, ఇంటి అద్దెల నుంచి అన్ని రకాల పేమెంట్లను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులను చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంటి రెంట్ చెల్లించే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా 200 శాతం వరకు పెనాల్టీ పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అసలు క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి రెంట్‌ను చెల్లిస్తే ఎందుకు పెనాల్టీ విధిస్తారు ? ఇలా చేయడం చట్ట విరుద్ధమా ? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రివార్డుల కోసం..
చాలా మంది తమ ఇంటి అద్దెను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే క్రమంలో అడ్డదారులు తొక్కుతున్నారు. రివార్డ్ పాయింట్లు, అఫర్ల కోసం హోమ్ రెంట్ పేరుతో నకిలీ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. ఆ నగదును బంధవులు లేదా స్నేహితుల అకౌంట్లకి మళ్లించుకుంటున్నట్లు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు గుర్తించాయి. అలాగే కొందరు వారి క్రెడిట్ కార్డు స్పెండింగ్ లిమిట్స్ లక్ష్యాలను చేరుకునేందుకు ఇలా.. ఫేక్ రెంట్ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అనేక థర్డ్ పార్టీ సంస్థలు నామ మాత్రపు రుసుము ఒక శాతం మాత్రమే యూజర్ల నుంచి వసూలు చేస్తున్నాయి.
'క్రెడిట్ కార్డ్' vs 'బయ్ నౌ పే లేటర్'.. రెండింట్లో ఏది బెటర్?