తెలంగాణ

telangana

ETV Bharat / business

సామాన్యుడిపై భారం.. జీఎస్​టీ రేట్లు పెంపు.. అప్పడాలు, పెరుగు, షార్ప్​నర్​పైనా..

GST rate hike: గత నెలలో జరిగిన జీఎస్‌టీ మండలి 47వ సమావేశంలో పలు రకాల వస్తువులు, సేవలపై జీఎస్‌టీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ రేట్ల పెంపు సోమవారం అమలు కానున్నాయి. దీని ప్రకారం ఏయే వస్తువులు, సేవలు భారం కానున్నాయంటే..

gst rate hike
gst rate hike

By

Published : Jul 18, 2022, 10:27 AM IST

GST rate hike: పెట్రోల్‌, డీజిల్‌ సహా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడనుంది. జూన్‌ 28, 29న చండీగఢ్‌లో జరిగిన జీఎస్టీ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు నేటి నుంచి మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీని ప్రకారం ఏయే వస్తువులు, సేవలు భారం కానున్నాయంటే..

జీఎస్‌టీ 18 శాతానికి పెరిగేవి ఇవే:

  • ఎల్‌ఈడీ లైట్లు, కత్తులు, కటింగ్‌ బ్లేడ్లు, పేపర్‌ కత్తులు, పెన్సిల్‌ చెక్కుకునే షార్ప్‌నర్‌, చెంచాలు, గరిటెలు, ఫోర్క్‌లు, స్కిమ్మర్‌, కేక్‌ సర్వర్లు, ప్రింటింగ్‌, డ్రాయింగ్‌, రైటింగ్‌ ఇంక్‌, ఫిక్సర్‌, వాటికి వినియోగించే మెటల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌బోర్డు
  • విద్యుత్‌ ఆధారిత పంపులు, సైకిల్‌ పంప్‌లు, డెయిరీ మెషినరీ, టెట్రా ప్యాక్‌లు
  • గింజలు, పప్పు ధాన్యాలను శుభ్రపర్చడం, వేరు చేయడం, గ్రేడింగ్‌ చేయడం లాంటి వాటికి ఉపయోగించే మెషీన్‌లు, ధాన్యాల మిల్లుల్లో వాడే యంత్రాలు, వెట్‌ గ్రైండర్లు, గోధుమ పిండి పట్టే మర
  • చెక్‌లు జారీ చేసినందుకు బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు.
  • రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శుద్ధి ప్లాంట్లు, క్రిమటోరియం, చారిత్రక కట్టడాలు, కాలువలు, ఆనకట్టలు, పైపులైన్లు, నీటి సరఫరా ప్లాంట్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులకు సంబంధించిన కాంట్రాక్టు పనులు.

12 శాతానికి..:

  • సోలార్‌ వాటర్‌ హీటర్‌ సిస్టం, చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ జాబ్‌ వర్క్‌లు, ప్రింటెడ్‌ మ్యాప్‌లు, అన్ని రకాల చార్టులు
  • మట్టిపనులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థల నుంచి వచ్చే కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టులు.

ఇతరత్రా..

  • కట్‌ అండ్‌ పాలిష్‌డ్‌ వజ్రాలపై 0.25 శాతం నుంచి 1.5 శాతానికి పెంపు
  • ఐసీయూ మినహా ఆసుపత్రుల్లో రోజుకు రూ.5,000కి పైగా అద్దె ఉన్న గదులకు ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్‌టీ
  • రోజుకు రూ.1000 వరకు అద్దె ఉండే హోటల్‌ గదులకు 12 శాతం జీఎస్‌టీ
  • ముందస్తుగా ప్యాక్‌ చేసిన లేబుల్డ్‌ గోధుమపిండి, అప్పడాలు, పన్నీర్‌, పెరుగు, మజ్జిగ - లస్సీ, మాంసం (ఫ్రోజెన్‌ మినహాయించి), చేపలు, తేనె; ఎండు చిక్కుళ్లు-మఖానా, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్‌ పైనా ఇకనుంచి 5 శాతం పన్ను పడుతుంది.
  • బ్యాటరీ ప్యాక్‌ అమర్చిన, లేకున్నా విద్యుత్తు వాహనాలకు 5 శాతం జీఎస్‌టీయే.

ఇవీ చదవండి:నేటి నుంచే పార్లమెంట్​ సమావేశాలు.. అగ్నిపథ్​పై చర్చకే విపక్షాలు పట్టు!

భవనం పైనుంచి శిశువును పడేసిన కోతి.. చిన్నారి అక్కడికక్కడే..

ABOUT THE AUTHOR

...view details