Pay By Car :డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మరో కీలక మార్పు రానుంది. అదే 'పే బై కార్'. దీనితో ఫోన్, బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే కారులోని ఓ సిస్టమ్ ద్వారా నేరుగా పెట్రోల్, డీజిల్ చెల్లింపులను చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్ సాయంతో ఫాస్టాగ్ రీఛార్జ్ సైతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఓ వ్యవస్థను త్వరలోనే అందరికీ అందుబాటులో తేనుంది టోన్‌ట్యాగ్ అనే సంస్థ.( Payments Through Car Infotainment Systems )
Pay By Car : కార్డు, ఫోన్లతో పనిలేదు.. కారు నుంచే ఆన్లైన్ పేమెంట్స్.. ఫాస్టాగ్ రీఛార్జ్ సైతం.. - కార్ ఇన్పోటైన్మెంట్ వ్యవస్థ బిజినెస్ వార్తలు
Pay By Car : ఆన్లైన్ చెల్లింపుల విషయంలో మరో కొత్త ఆవిష్కరణ తెరపైకి వచ్చింది. అదే Pay By Car. దీని సాయంతో బ్యాంక్ కార్డులు, ఫోన్లను వాడకుండానే నేరుగా కారు నుంచే పెట్రోల్, డీజిల్ చెల్లింపులు చేసుకోవచ్చు. త్వరలోనే ఈ సౌలభ్యం అందరికీ అందుబాటులోకి రానుంది.
Published : Sep 11, 2023, 9:21 PM IST
Fuel Payments Through Car Infotainment Systems : మాస్టర్ కార్డు, అమెజాన్ సాయంతో టోన్‌ట్యాగ్ అనే సంస్థ తాజాగా 'పే బై కార్'( Pay By Car ) అనే కొత్త ఆన్లైన్ పేమెంట్స్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. ఈ వ్యవస్థ యూపీఐ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఇటీవలే ఈ చెల్లింపుల వ్యవస్థను ఎంజీ హెక్టార్, భారత్ పెట్రోలియంలు సంయుక్తంగా కలిసి ప్రయోగాత్మకంగా పరీక్షించాయి. ఇటీవలే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఎన్పీసీఐతో కలిసి యూపీఐలో కన్వర్జేషనల్ పేమెంట్ల సిస్టమ్‌ను టోన్ ట్యాగ్ ఆవిష్కరించింది. దీనితో మీ కారులో ఉండే ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ ద్వారా ఈ రకమైన చెల్లింపులను సులువుగా చక్కబెట్టేసేయవచ్చు. కాగా, ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులు, ఫోన్ అవసరం అస్సలు ఉండదు.
ఇలా పనిచేస్తుంది..!
Petrol Payments Through Car Infotainment System : మీరు పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు మీ కారులో ఉండే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫ్యూయల్ డిస్పెన్సర్ నంబర్‌ను డిస్ప్లే చేస్తుంది. పెట్రోల్ బంక్‌కు రాగానే మీకు ఓ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అలాగే పెట్రోల్ బంక్ సిబ్బందినీ కూడా ఈ వ్యవస్థ అలర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా మీకు ఎంత మొత్తంలో పెట్రోల్ లేదా డీజిల్ కావాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని పెట్రోల్ సిబ్బందికి చేరవేస్తుంది. దీని ద్వారా కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో సురక్షితంగా పేమెంట్లు చేసుకోవచ్చు. మరోవైపు ఈ సదుపాయంతో ఫాస్టాగ్ రీఛార్జ్( Fast Tag Recharge Through Car Infotainment System ) కూడా సులువుగా చేసుకోవచ్చు. లావాదేవీల అనంతరం మీ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో అనే వివరాలు కూడా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- How to Port Mobile Number: మొబైల్ నెంబర్ మారకుండా.. నెట్వర్క్ మార్చేయండిలా..!
- Tata Nexon EV Features and Cost Details in Telugu : మార్కెట్లోకి సరికొత్త టాటా కారు.. ఫీచర్స్ అద్దిరిపోయాయిగా..!
- LIC Jeevan Umang Policy : ఈ ఎల్ఐసీ పాలసీతో.. 100 ఏళ్ల వరకు పెన్షన్ గ్యారెంటీ.. కుటుంబానికి ఆర్థిక భద్రత కూడా..