తెలంగాణ

telangana

ETV Bharat / business

పాన్-ఆధార్ లింక్​ గడువు పొడిగింపు.. ఎప్పటివరకు అంటే.. - ఆధార్ పాన్ లాస్ట్ డేట్​

పాన్​ కార్డు, ఆధార్ కార్డు అనుసంధాన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. చివరి సారిగా పెంచిన గడువు మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 2023 జూన్​ 30లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.

Pan Aadhar link decline extended
Pan Aadhar link decline extended

By

Published : Mar 28, 2023, 3:19 PM IST

Updated : Mar 28, 2023, 4:45 PM IST

పాన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో 2023 మార్చి 31గా ఉన్న గడువును 2023 జూన్​ 30 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జులై 1వ తేదీలోగా తమ ఆధార్​ను పాన్​తో లింక్​ చేయని వారి పాన్​కార్డ్​ పనిచేయదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 51 కోట్లకు పైగా పాన్‌కార్డ్​లు ఆధార్‌తో అనుసంధానమైనట్లు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాన్ కార్డ్​ను ఆధార్​తో లింక్​ చేయని వారికి మరో మూడు నెలల గడువు లభించింది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆధార్ నంబర్‌ను 2023 మార్చి 31లోగా పాన్ కార్డుకు లింక్ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. ప్రస్తుతం ఈ పాన్​- ఆధార్​ లింక్​ గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నంబర్​ను లింక్ చేయని పాన్ కార్డులు ఇక పనిచేయవని హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. పాన్ కార్డ్ పనిచేయకపోతే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అలాంటి పాన్ కార్డ్ హోల్డర్స్​కు సంబంధించి.. గతంలో ఏవైనా రీఫండ్స్ రావాల్సి ఉంటే వాటిని చెల్లించరని తెలిపింది సీబీడీటీ. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టీడీఎస్, టీసీఎస్​ను ఎక్కువగా వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రూ.1,000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్ లింక్ చేస్తే 30 రోజుల్లో పాన్ కార్డ్ యాక్టివ్ అవుతుందని సీబీడీటీ తెలిపింది.

పాన్‌- ఆధార్‌కు 2020 మార్చి 31ను తొలుత గడువుగా పేర్కొన్నారు. తర్వాత దాన్ని 2020 జూన్‌ 30కి, ఆ తర్వాత 2021 మార్చి 31కి, అనంతరం పలు దఫాలుగా గడువును పొడిగిస్తూ వచ్చిన కేంద్రం.. ఈ ఏడాది జూన్‌ 30లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకూ పాన్​-ఆధార్​ లింక్​ చేయని వారు రూ.1000 చెల్లించి.. ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే పాన్​ కార్డును ఆధార్​ నంబర్​తో ఎలా లింక్​ చేయాలో తెలుసుకుందామా..!

  • ముందుగా onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • NON-TDS/TCS ఆప్షన్​లో CHALLAN NO./ITNS 280 పైన క్లిక్ చేసి Proceed పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత కంపెనీలకు అయితే కార్పొరేట్ ట్యాక్స్, వ్యక్తిగతంగా అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్​ను సెలెక్ట్ చేయాలి.
  • Type of Payment ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత పాన్ కార్డ్ వివరాలు సెలెక్ట్ చేయాలి.
  • అసెస్‌మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసి అడ్రస్ పూర్తి చేయాలి.
  • ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి.

మీరు పేమెంట్ పూర్తి చేసిన 4 నుంచి 5 రోజుల​ తర్వాత ఆదాయపు పన్ను శాఖ రికార్డ్స్‌లో మీ వివరాలు అప్‌డేట్ అవుతాయి. ఆ తర్వాత ఈ-ఫైలింగ్ పోర్టల్‌ ఓపెన్ చేసి అందులో పాన్​ కార్డును ఆధార్​తో లింక్ చేయాలి.

  • దీనికోసం ముందుగా www.incometax.gov.in వెబ్​సైట్​ ఓపెన్​ చేయాలి.
  • వెబ్​సైట్ ఓపెన్​ అయ్యాక.. హోమ్ పేజీలో Link Aadhaar పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. Validate పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీరు చేసిన పేమెంట్ వివరాలు వెరిఫై అయినట్టు చూపిస్తుంది.
  • ఆ తర్వాత Continue పైన క్లిక్ చేయాలి.
  • ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు ఎంటర్ చేయాలి.
  • పేరు ఎంటర్​ చేశాక మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
  • మీ ఫోన్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి Validate చేస్తే.. మీ పాన్ కార్డ్​కు, ఆధార్ నంబర్ లింక్ అవుతుంది.

పైన తెలిపిన విధంగా.. మీరు మీ పాన్​ కార్డ్​ను ఆధార్ నంబర్​తో లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పాన్​-ఆధార్ లింక్​ చేశారో లేదో గుర్తులేకపోతే.. ఇదే పోర్టల్​లో 'లింక్​ ఆధార్​ స్టేటస్'పై క్లిక్​ చేసి తెలుసుకోవచ్చు.

Last Updated : Mar 28, 2023, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details