PAN Aadhaar Linking : మీరు ఇంకా మీ పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోలేదా? అయితే తొందరపడండి. ఈ జూన్ 30లోపు మీ ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసుకోండి. ఒక వేళ మీరు ఈ రెండింటిని లింక్ చేసుకోకపోతే.. జులై 1 నుంచి మీ పాన్ డీయాక్టివేట్ అవుతుంది. అంటే ఇక మీ పాన్ పనిచేయదు.
రూ.1000 ఆలస్య రుసుము
మీరు ఇన్‌కం టాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో మీ ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. అయితే ఆలస్య రుసుము కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ జూన్ 30లోపు మీరు ఈ పనిచేయనట్లయితే.. తరువాతి నెలలో కూడా రూ.1000 అపరాధ రుసుము చెల్లించి ఆధార్-పాన్ లింకింగ్ చేసుకోవచ్చు.
సమస్యలు వస్తాయి!
- పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి, సెబీ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది.
- పాన్-ఆధార్లను అనుసంధానం చేయకపోతే.. మీరు అదనంగా కట్టిన ఇన్‌కం టాక్స్‌కు రిఫండ్ కూడా రాదు. అంతే కాదు ఈ రిఫండ్‌పై వచ్చే వడ్డీని కూడా మీకు అందివ్వరు.
- మీరు చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్లపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
- చెల్లుబాటులేని పాన్‌తో మీరు బ్యాంకు అకౌంట్, డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి వీలుపడదు.
- ఒక వేళ ఇప్పటికే మీకు డీమ్యాట్ ఖాతా ఉన్నప్పటికీ షేర్లలో మదుపు చేయడం సాధ్యం కాదు.
- ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం చట్టపరమైన చర్యలకు కూడా బాధ్యులు అవుతారు. ముఖ్యంగా కేవైసీ నిబంధనలు పాటించకపోవడం వల్ల మీ పెట్టుబడి లావాదేవీలపై సెబీ పరిమితులు కూడా విధించే అవకాశం ఉంటుంది.