Pan Aadhaar Link : పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. లేదంటే పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
"ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్‌కార్డు హోల్డర్లంతా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇందుకు 2023 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్ నిరుపయోగంగా మారిపోతుంది. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇవాళే అనుసంధానం పూర్తి చేయండి" అని తన ట్విట్టర్లో పేర్కొంది.