Oxfam Report On Inequality 2024 :ప్రపంచంలో అత్యంత ధనవంతులైన తొలి ఐదుగురి నికర సంపద 2020 తర్వాత రెండింతలకు పైగా పెరిగినట్లు పేదరిక నిర్మూలనపై పనిచేసే ఆక్స్‌ఫామ్ అనే స్వచ్ఛంద సంస్థ తమ నివేదికలో తెలిపింది. ఇదే సమయంలో 500 కోట్ల మంది ఆదాయాలు పడిపోయాయని తెలిపింది. ప్రపంచంలో పేదరికం అంతం కావాలంటే మరో రెండు శాతాబ్దాలు పడుతుందని అంచనా వేసింది. రాబోయే పదేళ్లలో ప్రపంచంలో తొలి అవతరించే అవకాశం ఉంది.
ఆక్స్‌ఫామ్ నివేదికలోని వివరాల ప్రకారం గత మూడు సంవత్సరాలలో ప్రపంచంలోని 148 టాప్ కంపెనీలు 1.8 లక్షల కోట్ల డాలర్ల లాభాలను ఆర్జించాయి. ప్రతి ఏడాది సగటున 52 శాతం వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో లక్షలాది మంది ఉద్యోగుల వేతనాలు తగ్గడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అంతరాలను వివరిస్తూ 'ప్రపంచ ఆర్థిక వేదిక- డబ్ల్యూఈఎఫ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)' వార్షిక సదస్సుకు ముందు ఆక్స్‌ఫామ్ సోమవారం 'ఇనీక్వాలిటీ ఇంక్,' పేరిట ఒక నివేదికను విడుదల చేసింది.
నివేదికలోకి కీలక అంశాలివే!
- ప్రపంచంలోని 96 ప్రధాన కంపెనీలు ఆర్జిస్తున్న ప్రతి 100 డాలర్ల లాభంలో 82 డాలర్లు సంపన్న వాటాదారులకే చెందుతున్నాయి.
- ప్రపంచంలోని బిలియనీర్లు 2020తో పోలిస్తే 3.3 ట్రిలియన్ డాలర్ల అదనపు సంపదను ఆర్జించారు.
- ప్రపంచంలోని మొదటి 10 అతిపెద్ద కంపెనీల్లో ఏడింటిలో ఒక బిలియనీర్, సీఈఓ లేదా ప్రధాన వాటాదారుడిగా ఉన్నారు.
- ఐదుగురు కుబేరులు, ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్‌బర్గ్ సంపద గత మూడు సంవత్సరాలలో 464 బిలియన్ డాలర్లు పెరిగింది.
- 'ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)' సభ్యదేశాల్లో కార్పొరేట్ పన్ను 1980లో 48 శాతం ఉంది. ప్రస్తుతం అది 23.1 శాతానికి తగ్గింది.
- వరల్డ్‌వైడ్‌గా దాదాపు 800 మిలియన్ల మంది శ్రామికులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే స్థాయి వేతనాన్ని పొందలేకపోతున్నారు. దీని కారణంగా వీరంతా దాదాపు 1.5 లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు.
- ప్రపంచ జనాభాలో ఆస్ట్రేలియాతో పాటు ఉత్తరాది దేశాల వాటా 21 శాతమే. అయినప్పటికీ సంపద మాత్రం 69 శాతం ఈ దేశాల దగ్గరే ఉంది. ప్రపంచ బిలియనీర్ల సంపదలో 74 శాతం ఈ దేశాలకు చెందినవారిదే.
- ప్రపంచంలోని తొలి ఐదుగురు అత్యంత ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేస్తే వారి సంపద పూర్తిగా కరిగిపోవడానికి 496 ఏళ్లు పడుతుంది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల కంటే పురుషుల దగ్గర 105 ట్రిలియన్ డాలర్ల అధిక సంపద ఉంది. ఈ తేడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే నాలుగు రెట్లు అధికం.
- ప్రపంచంలో 43 శాతం 'ఫైనాన్షియల్ అసెట్స్', తొలి ఒక శాతం మంది ధనవంతుల వద్దే ఉంది.
100 బిలియన్ డాలర్ల ప్రత్యేక క్లబ్‌లోకి అంబానీ!
అమెరికాలోని అత్యంత శ్రీమంతుల్లో మనోళ్లు ఏడుగురు