Netflix Stop Password Sharing In India : ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ చందా (సబ్స్క్రిప్షన్) తీసుకుంటారో.. వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఇక నుంచి యాక్సెస్ చేయగలరని స్పష్టం చేసింది. ఈ మేరకు తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ మెయిల్స్ పంపింది.
తమ కస్టమర్ల అభిరుచి, వారి సంతృప్తి మేరకే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీ షోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ వివరించింది. అయితే, చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చని తెలిపింది. ప్రొఫైల్‌ను బదిలీ చేయటం, మేనేజ్ యాక్సెస్ అండ్ డివైజస్ వంటి కొత్త ఫీచర్ల సాయంతో ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా నెట్‌ఫ్లిక్స్.. తన ఫ్లాట్‌ఫాం ద్వారా చెప్పింది.
యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ పంపిన మెయిల్ 'సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగింది'
పాస్‌వర్డ్ షేరింగ్ విధానం తీసుకు వచ్చిన నేపథ్యంలో.. దాదాపు 60 లక్షల మంది కొత్త చందాదారులు చేరినట్లు నెట్‌ఫ్లిక్స్ బుధవారం తెలిపింది. నటీనటుల సమ్మె.. అమెరికా వినోద పరిశ్రమను తాకటం వల్ల సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో మొత్తం 23.80 కోట్ల సబ్‌స్క్రైబర్లతో 1.5 బిలియన్ల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది.
అయితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్టేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్‌తో పాటు 100కు పైగా దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను భవిష్యత్తులో అంగీకరించమని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
Netflix Subscribers Drop : కరోనా సమయంలో నెట్‌ఫ్లిక్స్ పంట పండింది. యాపిల్, వాల్ట్ డిస్నీ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలను తలదన్నే స్థాయిలో.. ఈ ఓటీటీ దిగ్గజం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 22.16 కోట్లకు చేరుకుంది. అయితే, ఈ ఏడాది జనవరి- మార్చి కాలంలో నెట్‌ఫ్లిక్స్ కస్టమర్లు భారీగా తగ్గారు. 2లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు నెట్‌ఫ్లిక్స్‌కు దూరమయ్యారు. 25 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. అది తలకిందులైంది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో సంస్థ మరో 20 లక్షల మంది కస్టమర్లు కోల్పోనుందని నెట్‌ఫ్లిక్స్ అంచనా వేసింది. ఆ నేపథ్యంలోనే దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు విధించడం, యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. పూర్తి కథనం చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.