Oneplus And Realme To Exit India TV Market :చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ దిగ్గజ కంపెనీలు వన్‌ప్లస్, రియల్మీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో టీవీల ఉత్పత్తి, అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయని జాతీయ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. అయితే స్మార్ట్ఫోన్ల విభాగంలో ఆ రెండు కంపెనీలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తాయని కథనంలో పేర్కొంది.
వన్‌ప్లస్, రియల్మీ కంపెనీలు టీవీల అమ్మకాల్లో భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. పండగల సమయాల్లో డిస్కౌంట్లు, భారీ ఆఫర్లు ఇచ్చి, తక్కువ ధరలకే వినియోగదారులకు టీవీలను అందిస్తుంటాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి వాటి కారణంగా ఇటీవల కాలంలో భారత్‌లో స్మార్ట్ టీవీలకు ఆదరణ పెరిగింది. అంతేగాక క్రికెట్ ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం ఇవ్వడం, వరుసగా పండగల సీజన్ కావడం వల్ల టీవీల అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఈ సమయంలో చైనా దిగ్గజ కంపెనీలు భారత్‌లో టెలివిజన్ రంగంలో వ్యాపారాలు నిలిపివేయడం గమనార్హం.
ఎల్జీ, శామ్సంగ్, సోనీ, పెనాసోనిక్ వంటి కంపెనీలు టెలివిజన్ రంగంలో భారత్‌లో రాణించాయి. అంతేగాక షావోమీ , టీసీఎల్ వంటి కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించి అమ్మకాల్లో మెరుగైన ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో వన్‌ప్లస్, రియల్మీ కంపెనీల టీవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. భారత్‌లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయడం గమనార్హం. వన్‌ప్లస్, రియల్మీ కంపెనీలు స్మార్ట్ఫోన్ల వ్యాపారంలో కొనసాగుతాయని.. కానీ భారత్‌లో టెలివిజన్ రంగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయని సంబంధిత వ్యాపార వర్గాలు తెలిపాయి.