How to Order Food in ONDC :ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవాలన్నా.. లంచ్ రెడీ చేసే ఓపిక లేకపోయినా.. డిన్నర్ ప్రిపేర్ చేసే తీరికలేకపోయినా.. అందరూ చేసే పని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేయడం. ఈ రంగంలో.. జొమాటో, స్విగ్గీ బైకులు దూసుకెళ్తున్నాయి. అయితే.. సమయానికి డెలివరీ జరుగుతున్నప్పటికీ.. ధర విషయంలో మాత్రం చాలా మంది వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ రెండు సంస్థలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఫుడ్ డెలివరీ శాఖను ప్రారంబించింది. దాని పేరే ONDC.
ఓఎన్డీసీ అంటే ఏమిటి..?
What is ONDC : ONDCఅంటే.. Open Network For Digital commerce. ఇది పరిశ్రమల అంతర్గత వాణిజ్య ప్రమోషన్ కోసం.. ఓపెన్ ఈ-కామర్స్‌ను అభివృద్ధి చేయడం కోసం.. ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖ. దీనిని 2022లోనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం దీనికి ఆదరణ పెరుగుతోంది.
Karimnagar Dabbawala : స్విగ్గీ, జొమాటో తరహాలో 'డబ్బావాలా' సేవలు
ఓఎన్డీసీలో తక్కువ ధరకే...!
Low Price in ONDC :ఈ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC).. ఫుడ్‌తో పాటు గ్రాసరీలు, క్లీనింగ్ వస్తువులు, హోం డెకర్స్ లాంటివి డెలివరీ చేస్తుంది. ఈ ఓఎన్డీసీని 2022 సెప్టెంబర్‌లో బెంగళూరులో లాంఛ్ చేశారు. ఇప్పుడు వివిధ నగరాలకు విస్తరించి.. స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ ఇస్తోంది. ఓఎన్డీసీ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్‌లో.. ఇతర సంస్థల కన్నా తక్కువ ధరకే ఆహారం లభిస్తుంది. ఒక్కో ఆర్డర్‌పై రూ. 50 నుంచి 70 వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఓఎన్డీసీని ఎలా ఉపయోగించాలి?
How to Use ONDC in Telugu :
- మీరు మొదట మీ మొబైల్లో పేటీఎం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- అనంతరం యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్‌లో ఓఎన్డీసీ అని టైప్ చేయండి.
- అప్పుడు ఆ పేజీలో మీకు గ్రాసరీల నుంచి ఫుడ్ డెలివరీ వరకు అనేక ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.
- మీకు ఫుడ్ ఆర్డర్ చేయాలనిపిస్తే.. ONDC Food మీద ప్రెస్ చేయండి.
- ఆ తర్వాత మీకు కావాల్సిన ఫుడ్‌ను అందులో సెర్చ్ చేయండి. అక్కడ మీకు అనేక రెస్టారెంట్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- అందులో మీకు నచ్చిన ఫుడ్‌ను సెలెక్ట్ చేసుకుని చెక్ ఔట్ కావాలి.
- ఆ చెక్ ఔట్ల వద్ద డిస్కౌంట్ కోడ్లు ఆటోమెటిక్‌గా వర్తిస్తాయి.
- అనంతరం మీకు నచ్చిన ఫుడ్ మీకు డెలివరీ అవుతుంది.
వీటి ద్వారా ఫుడ్ డెలివరీ చేసుకోండి : ప్రస్తుతం కొన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్లు మాత్రమే ONDC చెల్లింపులను అందిస్తున్నాయనే విషయం మీరు గమనించాలి. వాటిలో Paytm, Mystore, Craftsvilla, Spice Money, Meesho, Pincode, Magicpin లాంటి కొన్ని మాత్రమే ఈ ప్లాట్ఫార్మ్ను అందిస్తున్నాయి. Paytm దాని సొంత ఫుడ్ డెలివరీ సిస్టమ్‌ను కలిగి ఉన్నా.. మీరు ఈ ఓఎన్డీసీతో పేటీఎంను ఉపయోగిస్తే స్విగ్గీ(Swiggy), జొమాటోల కంటే తక్కువగానే మీ ఫుడ్ డెలివరీ బిల్లు వస్తోంది. అయితే.. అన్ని రెస్టారెంట్లు ఇందులో అందుబాటులో ఉండకపోవచ్చు. ఓఎన్డీసీ కొత్తగా ప్రారంభించింది కనుక.. ఈ ఓఎన్డీసీ కార్యకలాపాలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.
ఈ-కామర్స్‌లో ONDC విప్లవం.. సర్కారు వారి 'డిస్కౌంట్ వార్'!
స్విగ్గీ బంపర్ ఆఫర్.. ఇకపై వారంతా మేనేజర్స్.. ఫుల్‌టైమ్ జాబ్, సూపర్ సాలరీ!
ఆ బ్యాచ్‌లర్‌కి వచ్చిన ఆలోచనే.. 'స్విగ్గీ'