తెలంగాణ

telangana

By

Published : Aug 15, 2023, 7:24 PM IST

ETV Bharat / business

ఓలా నుంచి కొత్త ఈ-బైక్స్.. రూ.80వేల కన్నా తక్కువకే.. ఇంజిన్ బైక్​ల పని అయిపోయినట్టే!

Ola S1X Electric Scooter Price : అతి తక్కువ ధరకే ఈ-స్కూటర్​ను అందుబాటులోకి తెచ్చింది ఓలా. ఎంట్రీ లెవెల్ స్కూటర్​ను రూ.79,999కే మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు భవిష్యత్​లో విడుదల చేయనున్న మోడళ్లను సైతం ప్రదర్శించింది.

Ola S1X Electric Scooter Price
ola s1x specifications

Ola S1X Electric Scooter Price : ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకెళ్తున్న ఓలా.. సరికొత్త బైక్ మోడళ్లను ఆవిష్కరించింది. ఎస్1ఎక్స్ పేరుతో ఎంట్రీ లెవెల్ ఈ-స్కూటర్లను లాంఛ్ చేసింది. ఇంజిన్లతో నడిచే సంప్రదాయ ద్విచక్రవాహనాలకు పోటీ ఇచ్చే విధంగా అతితక్కువ ధరకే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్​ను అందుబాటులోకి తెచ్చింది. రూ.79,999కే దీన్ని మార్కెట్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు 2024 చివరి నాటికి తమ సంస్థ విడుదల చేయనున్న నాలుగు ఎలక్ట్రిక్ బైక్​ల నమూనాలను ప్రదర్శించింది. తమిళనాడు కృష్ణగిరిలోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో నిర్వహించిన కస్టమర్ ఈవెంట్​లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్ అగర్వాల్ ఈ మేరకు కొత్త మోడళ్ల వివరాలు వెల్లడించారు.

  • ఓలా ఎస్1ఎక్స్ ఫీచర్లు
    • Ola S1X Specifications : కంపెనీ విడుదల చేసిన ఇతర మోడళ్ల మాదిరిగానే ఈ ఓలా ఎస్1ఎక్స్ సైతం స్టైలిష్​గా కనిపిస్తోంది.
    • ఎస్1ఎక్స్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది.
    • సింగిల్ ఛార్జ్​తో 151 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
  • మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండనుంది.
    • ఎస్1ఎక్స్ (2kwh)
    • ఎస్1ఎక్స్ (3kwh)
    • ఎస్1ఎక్స్ ప్లస్ (3kwh + ఇతర ఫీచర్లు)

ఆఫర్ ధర.. వారం మాత్రమే!
Ola S1X On Road Price : ఎస్1ఎక్స్ 2kwh బ్యాటరీ వేరియంట్​ ప్రారంభ ధరను రూ.79,999గా నిర్ణయించినట్లు భవీశ్ అగర్వాల్ వెల్లడించారు. తొలి వారం రోజులు మాత్రమే ఈ ఆఫర్ ధర అమలులో ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత బైక్ ధరను రూ.89,999కి పెంచనున్నట్లు వివరించారు. ఈ వాహనాల బుకింగ్స్ ( Ola S1X Booking ) వెంటనే ప్రారంభం కానున్నాయి. డిసెంబర్​ నుంచి వాహనాల డెలివరీ ప్రారంభమవుతుంది.

అదే విధంగా ఎస్1ఎక్స్ 3kwh వేరియంట్​ రూ.89,999కి అందుబాటులో ఉంటుందని, వారం తర్వాత దాని ధర రూ.99,999గా ఉంటుందని భవీశ్ వివరించారు. ఈ వాహనాల డెలివరీ సైతం డిసెంబర్ నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. ఎస్1ఎక్స్+ ( Ola S1X Plus Price ) ప్రారంభ ధర రూ.99,999గా ఉండగా.. వారం తర్వాత అది రూ.1,09,999కి పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ మోడళ్లను సైతం కస్టమర్లు వెంటనే బుక్ చేసుకోవచ్చని, డెలివరీ సెప్టెంబర్ చివరి నాటికే ప్రారంభిస్తామని తెలిపారు.

ఆ బైక్​ల కాలం చెల్లినట్టే..
ఎస్1ఎక్స్, ఎస్1ఎక్స్+ వేరియంట్ల సాఫ్ట్​వేర్లు వేరని, కనెక్టివిటీ ఫీచర్లు సైతం భిన్నంగా ఉంటాయని భవీశ్ స్పష్టం చేశారు. ఈ ఎంట్రీ లెవెల్ వాహనాలను రోజూ 10-20 కిలోమీటర్లు ప్రయాణించేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఈ వాహనాలతో ఐసీఈ స్కూటర్లకు కాలం చెల్లినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లోకి ఓలా ఎంట్రీపైనా స్పష్టతనిచ్చారు.

"కీలక టెక్నాలజీలను దేశీయంగా అభివృద్ధి చేసి, సప్లై ఛైన్లను మెరుగుపర్చి.. ఐసీఈ, ఈవీ ధరల మధ్య సారూప్యత తెచ్చేందుకు వేగంగా, స్పష్టమైన విజన్​తో పనిచేస్తున్నాం. ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడటమే చాలా ప్రయోజనకరం. ఓలా ప్రవేశపెట్టిన ఈ స్కూటర్ల ద్వారా ఐసీఈ స్కూటర్లకు కాలం చెల్లుతుంది. 2024 చివరి నాటికి ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచ మార్కెట్​లో అందుబాటులోకి రానున్నాయి. ఈ బైక్​లు ప్రపంచం కోసం ఇండియాలో తయారవుతాయి."
-భవీశ్ అగర్వాల్, ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ

ఎస్1ప్రో సెకండ్ జనరేషన్..
Ola S1 Pro Gen 2 :కొత్త మోడళ్లతో పాటు ఎస్1ప్రో సెకండ్ జనరేషన్ బైక్​ను సైతం ఓలా ఆవిష్కరించింది. రూ.1,47,499కి దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్​లో ఈ వాహనాల డెలివరీ ప్రారంభిస్తామని తెలిపింది. ఇవే కాకుండా ఎస్1 ఎయిర్ అనే ఈ-స్కూటీని సైతం ఓలా ఉత్పత్తి చేస్తోంది.

ఫ్యూచర్ బైక్స్ అదుర్స్..
భవిష్యత్​లో అందుబాటులోకి తేవాలని భావిస్తున్న బైక్​ల నమూనాలను సైతం తాజా కార్యక్రమంలో ఓలా ప్రదర్శించింది. డైమండ్​హెడ్, అడ్వెంచర్, రోడ్​స్టర్, క్రూజర్​ వేరియంట్లను పరిచయం చేసింది. దీంతో పాటు బైక్​లలో వినియోగించే మూవ్ఓఎస్4 సాఫ్ట్​వేర్ అప్డేట్ తీసుకొచ్చింది. వందకు పైగా ఫీచర్లకు మెరుగులు దిద్దడమే కాకుండా.. ఓలా మ్యాప్స్, ఫైండ్ మై స్కూటర్, జియో ఫెన్సింగ్ వంటి 20 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

200 కి.మీ మైలేజీ ఇచ్చే సూపర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ధర ఎంతంటే?

సెకండ్​ హ్యాండ్ బైక్ కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details